డిజిటల్ లావాదేవీలు వృద్ధి : ఆర్‌బీఐ డేటా

by Harish |
డిజిటల్ లావాదేవీలు వృద్ధి : ఆర్‌బీఐ డేటా
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఐదేళ్లలో భారత్‌లో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయని ఆర్‌బీఐ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత కొంతకాలంలో దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలోనే డిజిటల్ చెల్లింపుల పరిమాణం అనేక రెట్లు పెరిగింది.

2015-16 నుంచి 2019-20 మధ్య డిజిటల్ చెల్లింపులు 55.1 శాతం వార్షిక వృద్ధిని సాధించాయని, 2016 మార్చి వరకు 593.61 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరగ్గా, 2020, మార్చి నాటికి ఏకంగా 3,434.56 కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడించాయి. ఖచ్చితంగా చెప్పాలంటే, 2016 నుంచి 2020 మధ్య కాలంలో వార్షిక వృద్ధి రేటు 15.2 శాతంగా ఉంది.

ఏడాది ప్రాతిపదికన గణాంకాలను పరిశీలిస్తే..2016-17లో డిజిటల్ చెల్లింపులు వాల్యూమ్‌ల పరంగా 593.61 కోట్ల నుంచి 969.12 కోట్లకు పెరిగాయి. విలువ పరంగా రూ. 1,120.99 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి. 2017-18లో విలువ పరంగా రూ. 1,369.86 లక్షల కోట్లకు పెరిగింది.

2018-19లో విలువ పరంగా రూ. 1.638.52 లక్షల కోట్లకు పెరిగింది. ఇక, 2019-20 ఆర్థిక సంవత్సరంలో వాల్యూమ్‌ల పరంగా భారీగా 3,434 కోట్లకు పెరగ్గా, విలువ పరంగా రూ. 1,623.05 లక్షల కోట్లకు సరిపెట్టాయి. ఈ ఐదేళ్లలో వృద్ధిని గమనిస్తే..లావాదేవీలను వాల్యూమ్‌ల పరంగా వార్షిక వృద్ధి రేటు 55.1 శతంగా ఉండగా, విల్కువ పరంగా 15.2 శాతం ఉన్నట్టు ఆర్‌బీఐ డేటా సూచిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed