- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RBI కీలక ప్రకటన.. ఈ ఏడాది చివర్లో డిజిటల్ కరెన్సీ నమూనా..
దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఈ ఏడాది చివరిలోగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ) నమూనాను విడుదల చేయాలని భావిస్తున్నట్టు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టీబీ రబి శంకర్ అన్నారు. ఆర్‌బీఐ అంతర్గతంగా డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే అవకాశాలను విశ్లేషిస్తోందని, దాని పరిధి, సాంకేతికత, పంపిణీ విధానం, ధృవీకరణ లాంటి అంశాలపై పరిశీలిస్తోందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో రబి శంకర్ డిజిటల్ కరెన్సీని దశలవారీగా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే పలు దేశాల్లో డిజిటల్ కరెన్సీ కోసం ట్రయల్ రన్ ప్రారంభమైందని, భారత్‌లోనూ డిజిటల్ కరెన్సీని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
దీనికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో డిజిటల్ కరెన్సీ తెచ్చే సరైన తేదీని చెప్పలేకపోయినప్పటికీ సమీప భవిష్యత్తులో మోడల్ నమూనాను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. బహుశా ఈ ఏడాది చివరినాటికి తీసుకురావొచ్చని ఎంపీసీ సమావేశ సందర్భంగా జరిగిన రబి శంకర్ చెప్పారు. బ్యాంకుల డిపాజిట్ సామర్థ్యాలను ఎలా దెబ్బతీస్తుంది. డిజిటల్ కరెన్సీ వల్ల ఉత్పన్నమయ్యే వివిధ సమస్యలపై ప్రభావం గురించి జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాత ఆర్‌బీఐ సొంత సీబీడీసీని దశలవారీగా ప్రవేశపెడుతుందని రబి శంకర్ వెల్లడించారు. రానున్న రోజుల్లో హోల్‌సేల్, రిటైల్ విభాగాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు.