భద్రాద్రిలో దారుణం.. అమ్మవారి గర్భగుడిలో గుప్తనిధుల వేట

by Sumithra |
భద్రాద్రిలో దారుణం.. అమ్మవారి గర్భగుడిలో గుప్తనిధుల వేట
X

దిశ, మణుగూరు : – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపింది. మండలంలోని మల్లంపాడు చెరువు పక్కన ముత్యాలమ్మ తల్లి ఆలయ గర్భగుడిలో గుప్త నిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు జరిపారు. తల్లి విగ్రహానికి రక్తాభిషేకం చేసి ఆలయ గర్భగుడిలో ఆరు అడుగుల గొయ్యిని దుండగులు తవ్వారు. దుండగులు తీసుకువచ్చిన కోడిని గర్భగుడిలోనే వదిలేశారు. తల్లి విగ్రహానికి పూజ చేయడానికి వచ్చిన స్థానికులు ఆలయ గర్భగుడిలో గొయ్యిలను చూసి భయబ్రాంతులకు గురయ్యారు.

వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.కాకతీయుల కాలం నాడు నిర్మించిన పురాతన ఆలయం కావడంతో తవ్వకాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన దుండగులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story