దేవినేని ఉమా ఉద్దేశపూర్వకంగానే అలజడి సృష్టించారు : డీఐజీ మోహనరావు

by srinivas |   ( Updated:2021-07-28 03:42:08.0  )
దేవినేని ఉమా ఉద్దేశపూర్వకంగానే అలజడి సృష్టించారు : డీఐజీ మోహనరావు
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌పై డీఐజీ మోహనరావు స్పందించారు. ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతో జి.కొండూరులో అలజడి‌ సృష్టించారని తెలిపారు. ముందస్తు పథకంలో భాగంగా దుర్దేశం పూర్వకంగా ఉమా కొండపల్లి నుంచి తన అనుచరులతో వెళ్లినట్లు తమ విచారణలో తేలిందన్నారు. జి.కొండూరులో జరిగిన అలజడికి దేవినేని ఉమాయే కారణమని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని తెలిపారు. మరోవైపు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును అరెస్ట్ చేశామని.. ఆయన తమ కస్టడీలోనే ఉన్నట్లు కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థకౌశల్ స్పష్టం చేశారు. ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారన్నారు. 100శాతం ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పుకొచ్చారు.

దేవినేని ఉమాపై కంప్లెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. దేవినేని ఉమాతో పాటు మొత్తం 17మంది టీడీపీ వర్గీయులపై కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బొమ్మసాని సుబ్బారావు, కేవీవీ సత్యనారాయణ, రామినేని రాజా,చనుమోలు నారాయణ, జాస్తి రామకృష్ణ, పేదర్లా రవి, ఇరుకులపాటి సతీష్, అంకేం సురేష్, బెజవాడ గణపతి, ఉయ్యురు రమణ, చనుమోలు బాబు, పజ్జురు చందు, చుట్టుకుదురు శ్రీను, సుఖవాసి శ్రీహరి, ఈమని మురళి మంచినేని రాజశేఖర్, బొల్లా లీల ప్రసాద్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed