డబ్ల్యూటీఐ, బ్రెంట్ క్రూడాయిల్‌ల మధ్య తేడా ఏంటో తెలుసా!

by Harish |
డబ్ల్యూటీఐ, బ్రెంట్ క్రూడాయిల్‌ల మధ్య తేడా ఏంటో తెలుసా!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా చమురు మార్కెట్లో డబ్ల్యూటీఐ చమురు ధరలు రికార్డు స్థాయిలో మైనస్ 37 డాలర్లకు పడిపోవడం చరిత్రలో మొదటిసారి కావడంతో ఇప్పుడందరీ చూపు చమురు ధరల పరిస్థితి ఎలా ఉండబోతోందనే దానిపైనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా చమురుకు అతితక్కువ డిమాండ్, సరఫరాకు దారి తీసింది. సోమవారం వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) చ్రూడాయిల్ ధర ఏకంగా 306 శాతం తక్కువగా ట్రేడయి బ్యారెల్‌కు మైనస్ 37.63 డాలర్లకు చేరింది. మైనస్ 40 డాలర్లకు కూడా చేరుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ ముడిచమురుకు నిల్వ ప్రదేశాలు అందుబాటులో ఉండటంతో డెలివరీలు సులభతరంగా ఉంది. అయినా, సోమవారం బ్రెంట్ క్రూడాయి 9 శాతం తగ్గి బ్యారెల్‌కు 25.57 డాలర్లకు చేరుకుంది.

అంతా బాగానే ఉంది కానీ…అసలు డబ్ల్యూటీఐ, బ్రెంట్ క్రూడాయిల్‌ల మధ్య వ్యత్యాసం ఏంటి అనే సందేహం చాలామందిలో ఉంది. ఈ రెంటి మధ్య ఉన్న బేధాన్ని పరిశీలిద్దాం!

బ్రెంట్ :

బ్రెంట్ క్రూడాయిల్ తక్కువ సాంద్రత ఉన్న ముడిచమురు. ఇందులో సల్ఫర్ పరిమాణం తక్కువగా ఉంటుంది. ఈ క్రూడాయిల్‌ను ఉత్తర సముద్రం నుంచి సేకరిస్తారు. తక్కువ సల్ఫర్ ఉండటం వల్ల పెట్రోల్, డీజిల్ సహా ఇతర ఇంధనాల కోసం శుద్ధి చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.

డ‌బ్ల్యూటీఐ :

డ‌బ్ల్యూటీఐ ర‌కం అమెరికాలో ఉన్న బావుల నుంచి సేకరిస్తారు. ఈ రకం కూడా తేలికగా ఉండి, తీపి కలిగి ఉంటుంది. దీన్ని సముద్రం నుంచి కాకుండా భూగ‌ర్భ‌ ప్రాంతాల నుంచి సేకరిస్తారు. దీన్ని భూగర్భం స్థలం నుంచి రవాణా చేయడానికి అధిక వ్య‌యం అవుతుంది.

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధ‌ర పెట్రోలియం ఎగ‌మ‌తి దేశాల స‌మాఖ్య‌(ఒపెక్) తీసుకునే నిర్ణ‌యాలపై ఆధార‌ప‌డి ఉంటుంది. బ్రెంట్ ధ‌ర‌పై డబ్ల్యుటీఐ ధ‌ర‌ ప్రభావం కూడా ఉంటుంది. ఇది అమెరికా చేసే ఉత్పత్తిపై ఎక్కువగా ఆధారపడి ఉంది.

Tags: WTI, Brent, Crude oil, america

Advertisement

Next Story

Most Viewed