- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తక్కువ వడ్డీతో కొవిడ్-19 పర్సనల్ లోన్!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో బ్యాంకులు వినియోగదారుల కోసం ఎదురుచూస్తున్నాయి. కష్టకాలంలో కస్టమర్లకు పర్సనల్ లోన్లను అందిస్తున్నాయి. బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న వినియోగదారులూ, బ్యాంకుల నుంచి పెన్షన్ తీసుకునే వారూ, లేదా ఇదివరకే బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్న వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ రుణాలను అందిస్తున్నారు. అయితే, ఇంతకుముందు బ్యాంకు పర్సనల్ లోన్లకు, ఇప్పుడిస్తున్న రుణాలకు కొంత వ్యత్యాసం ఉంది. కోవిడ్-19కి ముందు ఇచ్చిన పర్సనల్ లోన్‌కు, కోవిడ్-19 పర్సనల్ లోన్‌కు మధ్య తేడాలను తెలుసుకుందాం!
సాధారణంగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఉద్యోగ వివరాలు, నెలవారీ ఆదాయం, ఉద్యోగి వివరాలు, క్రెడిట్ స్కోరు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని లోన్లను అందించేవి. కానీ, కొవిడ్-19 రుణాలను మాత్రం వేతనం, లోన్, పెన్షన్ అకౌంట్లు ఉన్నవారికి మాత్రమే ఇవ్వనున్నాయి. పర్సనల్ లోన్ కింద రూ. 50 వేల నుంచి రూ. 20 లక్షల వరకూ రుణాన్ని పొందే అవకాశముంది. కొవిడ్-19 లోన్‌కు రూ. 5 లక్షల వరకే ఇస్తారు. కనీస రుణం రూ. 25 వేలుగా నిర్ణయించారు. వడ్డీ చెల్లింపుల్లో కూడా కొంత వ్యత్యాసముంది. సాధారణ పర్శనల్ లోన్‌కు 9 నుంచి 24 శాతం మధ్య వడ్డీ ఉంటుంది. అలాగే, ప్రాసెసింగ్ ఫీజు కింద 3 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కొవిడ్-19 లోన్లపై వడ్డీని 7.2 శాతం నుంచి 10.5 శాతంలోపే ఉంటుంది. అత్యవసర లోన్లు కాబట్టి కొవిడ్-19 లోన్లకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడంలేదు.
లోను టెన్యూర్ విషయంలో..రెగ్యులర్ పర్సనల్ లోను తీసుకుంటే రుణ మొత్తాన్ని 5 ఏళ్లలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొవిడ్-19 లోనుకు 3 ఏళ్ల టెన్యూర్ అవకాశం ఇచ్చారు. బ్యాంకులు ఎంపిక చేసిన రుణ గ్రహీతలకు, డిపాజిట్లకు మాత్రమే ఈ రుణాలు ఇస్తున్నాయి. అంతేకాకుండా, క్రెడిట్ కార్డు ఉన్న వారికి కూడా ప్రీ-అప్రూవ్‌డ్ల్ లోన్లను తీసుకోవచ్చు. హోమ్ లోన్ తీసుకున్న వినియోగదారులు టాప్అప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ పర్సనల్ లోన్‌తో పోలిస్తే హోమ్ లోన్ టాప్అప్స్‌పై వడ్డీ తక్కువగా ఉంటుంది. పైగా, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రుణాన్ని వీలైనంత త్వరగా మంజూరు చేస్తున్నారు.
Tags : Covid-19-specific personal loan, regular personal loan, covid-19, coronavirus impact