- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బండి సంజయ్ తొందరపడ్డారా? పీకే మ్యాటర్ మర్చిపోయారా?
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొలిసారి తొందరపడ్డారా? ఏ విషయంలోనైనా లాజిక్ పాయింట్ పట్టి కేసీఆర్‌కు సైతం ఊపిరి సలపకుండా చేస్తున్న సంజయ్.. నోరు జారారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీ రాజకీయాలపై నోరెత్తని ఆయన, ఏపీలో దేవత విగ్రహాల ధ్వంసం వ్యవహారంపై స్పందిస్తూ… డైరెక్ట్‌గా మతగ్రంథాలను బేస్ చేసుకొని చేసిన కామెంట్స్ వెనక మర్మమేంటి? కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లేకుంటే తెలంగాణ స్ట్రాటజీని ఏపీపై రుద్దే ప్రయత్నం చేశారా? అన్నది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రజలకు బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలని సెన్సేషనల్ కామెంట్లు చేసిన సంజయ్.. ఏపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ విషయాన్ని మరిచారని, అందుకే బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో అన్న కామెంట్లు చేశారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఏపీలో తాజాగా మారిన సమీకరణాల ప్రకారం బీజేపీ.. జనసేనతో అండర్‌స్టాండింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీతో పొలిటికల్ మీటింగ్స్‌లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్.. కాషాయ శ్రేణులకు టచ్‌లోనే ఉంటున్నారు. రాష్ట్రంలో ర్యాలీలు, ధర్నాలకు పిలుపునిస్తూ ప్రభుత్వంపై బీజేపీ, జనసేన సమన్వయంతో పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఎన్నివిమర్శలు చేసినా మతాల పరంగా ఒక్క మాట అనలేదు. కానీ నిన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తిరుపతి ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘బైబిల్ పార్టీ కావాలా.. భగవద్గీత పార్టీ కావాలా’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనంగా మారగా.. సంజయ్ మాత్రం అసలు విషయం తెలుసుకోకుండా మాట్లాడారని కొందరు నేతలు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నోవా క్రిస్టియనేనని, ఒక క్రిస్టియన్‌ను మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు.. ఏపీ ప్రజలకు బైబిల్ పార్టీ కావాలా.. భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలని ఎలా మాట్లాడారన్న పాయింట్‌ను తెరమీదకు తీసుకువస్తున్నారు.
అంతేగాక గతంలో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే క్రైస్తవులందరినీ ఉచితంగా జెరూసలేం యాత్రకు పంపుతామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏపీ విషయంలో ఈవిధంగా మాట్లాడుతుండటంతో కాషాయం నేతలపై విమర్శలు వస్తున్నాయి. నాగాలాండ్ వంటి రాష్ట్రంలో మైనార్టీలకు అండగా ఉంటామని చెబుతూ మిగతా రాష్ట్రాల్లో మరో విధంగా వ్యాఖ్యానించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఇదేకాదు మైనార్టీ వర్గానికి చెందిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పార్శీ అయిన స్మృతి ఇరానీని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకొని, ఇప్పుడు ఉపఎన్నిక వేళ ఒక మతానికి అనుకూలంగా మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
దేశంలో రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను సమానంగా గౌరవించాలని.. ఏ మతం, వర్గాన్ని కించపరిచే విధంగా చూడొద్దని కేంద్ర పెద్దలే చెబుతుంటే.. మరోవైపు ఆ పార్టీ నేతలే ఒక మతానికి అనుకూలంగా బైబిల్ పార్టీ కావాలా.. భగవద్గీత పార్టీ కావాలని అని మాట్లాడుతుండటంతో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అసలు ఈ విషయంపై బండి సంజయ్ స్టడీ చేశారా లేదా? అని తెలుగు రాష్ట్రాల నేతలతో పాటు ప్రజల నుంచి కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.