చిరు సర్జా బేబీకి ధృవ కాస్ట్‌లీ గిఫ్ట్ రెడీ!

by Shyam |
చిరు సర్జా బేబీకి ధృవ కాస్ట్‌లీ గిఫ్ట్ రెడీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ యంగ్ హీరో చిరంజీవి సర్జా హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ హఠాత్ పరిణామంతో గర్భంతో ఉన్న ఆయన భార్య మేఘన సర్జా ఆవేదన వర్ణనాతీతం. అయినా సరే, చిరంజీవి తన కడుపులో ఉన్న బిడ్డగా మళ్లీ తిరిగొస్తాడనే ఆశతో ఉంది. ఈ మధ్య జరిగిన శ్రీమంతం కార్యక్రమాన్ని కూడా చిరంజీవి సర్జా ఫొటో పక్కన ఉంచుకుని, తను పక్కనే ఉన్నట్లుగా భావించి జరుపుకుంది.

కాగా త్వరలోనే బేబీ రాబోతుండడంతో చిరంజీవి సోదరుడు ధృవ సర్జా.. పుట్టబోయే బిడ్డ కోసం కాస్ట్‌లీ గిఫ్ట్ రెడీ చేశాడు. తన కోసం రూ. 10 లక్షల విలువైన ఊయలను సిద్ధం చేశాడు. కాగా ధృవ ఊయల పక్కన నిల్చున్న ఫొటో హాట్ టాపిక్ కాగా.. ధృవ తన వదినకు సపోర్ట్‌గా నిలుస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది.

ఈ మధ్య ధృవ పుట్టినరోజున మేఘన పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు హైలెట్ అవుతోంది. ‘నా పక్కన నువ్వు ఎలాగైతే స్ట్రాంగ్‌గా నిలబడతావో, నేను కూడా అన్నివేళలా అలాగే ఉంటాను. హ్యాపీ బర్త్‌డే మై బర్త్‌డే బాయ్. చిరు ఎలా నవ్వుతూ ఉంటాడో నువ్వు కూడా అలాగే నవ్వుతూ ఉండాలి’ అని విష్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed