'నాన్న నా ప్రాణం' .. ధృవ్ ఎమోషనల్ పోస్ట్

by Shyam |   ( Updated:2020-03-03 01:38:25.0  )
నాన్న నా ప్రాణం .. ధృవ్ ఎమోషనల్ పోస్ట్
X

యంగ్ అండ్ స్టైలిష్ హీరో ధృవ్ … ‘ఆదిత్య వర్మ’గా తొలి సినిమాతోనే తమిళ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. ఫస్ట్ సినిమాతోనే మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే ‘ఆదిత్య వర్మ’ సినిమా కోసం తండ్రి చియాన్ విక్రమ్ ఎంత కష్టపడ్డాడో తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ధృవ్.

నేను నాపై నమ్మకం కోల్పోతున్నప్పుడు కూడా నువ్వు నమ్మి సపోర్ట్ ఇచ్చావు అని.. ఇంత మంది అభిమానులను పొందానంటే కారణం నువ్వు మాత్రమే డాడి అంటూ థాంక్స్ చెప్పాడు. ‘ఆదిత్య వర్మ’ సినిమా రీమేక్ అయుండొచ్చు కానీ.. ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉండే చిత్రంగా మిగిలిపోతుందన్నారు. ఈ సినిమా చేసే క్రమంలో ఒక ఫ్యాన్‌గా నాన్న దగ్గర చాలా నేర్చుకున్నానని… అది జీవితాంతం గుర్తుంచుకుంటానన్నారు ధృవ్. ‘ఆదిత్య వర్మ’ అనేది మీ భావన… ఆ భావనే నాకు ప్రాణం పోసింది నాన్న … అదే నన్నుహీరోగా నిలబెట్టిందంటూ ఎమోషనల్ అయ్యాడు. మీ కొడుకుగా మన కలలను నిజం చేసేందుకు కృషి చేస్తానని సోషల్ మీడియా వేదికగా మాట ఇచ్చాడు ధృవ్. కాగా ఇన్‌స్టాగ్రాంలో మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగిన వర్మ… ఇన్‌స్టా ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలిపాడు. మీ ప్రేమాభిమానాలు ఇలాగే సాగాలని కోరుకున్నాడు.

‘ఆదిత్య వర్మ’ సినిమా విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్. అయితే ఈ సినిమా తొలుత బాలా దర్శకత్వంలో ‘వర్మ’ టైటిల్‌తో తెరకెక్కింది. 70శాతం సినిమా పూర్తయ్యాక … ఔట్ పుట్ సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ను ఆపేశారు. ధృవ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సినిమా కాబట్టి కాంప్రమైజ్ కాలేదు తండ్రి చియాన్ విక్రమ్. దీంతో దర్శకుడు, వర్కింగ్ టీంతో పాటు నటీనటులను కూడా మార్చేసి మళ్లీ కొత్తగా సినిమా మొదలుపెట్టారు. గిరీశాయ డైరెక్షన్‌లో ‘ఆదిత్య వర్మ’ టైటిల్‌తో సినిమా రూపుదిద్దుకోగా.. ధృవ్ నటనకు ఫిదా అయ్యారు తమిళులు.

Tags: Dhruv Vikram Emotional Post on Social Media

Advertisement

Next Story