క్రికెట్‌లోనే కాదండోయ్.. రైతన్నగా కూడా ధోనీ సత్తా

by Anukaran |   ( Updated:2021-03-07 02:37:34.0  )
క్రికెట్‌లోనే కాదండోయ్.. రైతన్నగా కూడా ధోనీ సత్తా
X

దిశ వెబ్‌డెస్క్: కెప్టెన్ కూల్‌గా అందరూ ముద్దుగా పిలుచుకునే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్‌లో భారత్‌కు ప్రపంచకప్‌లతో పాటు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియాను నెంబర్ వన్ స్థానికి తీసుకెళ్లాడు. క్రికెట్‌లో భారత్‌కు తిరుగులేదని నిరూపించిన ఈ జార్ఖండ్ డైనమెట్.. తన పేరిట కూడా ఎన్నో రికార్డులను రాసుకున్నాడు. అయితే క్రికెట్‌లో రికార్డులతోనే కాదు.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత రైతుగా మారి వ్యవసాయంలోనూ ధోనీ తన సత్తా చాటుతున్నాడు.

రాంచీలోని తన ఫాంహౌస్‌లో అనేక పంటలను ధోనీ పండిస్తుున్నాడు. గతంలో ధోనీ ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తన పొలంలో పుచ్చకాయలు, బొప్పాలతో పాటు అనేక పంటలను ధోనీ పండిస్తున్నాడు. ఎలాంటి ఎరువులు ఉపయోగించకుండా ధోనీ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాడు.

ఈ క్రమంలో ధోనీ తన పొలంలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా స్ట్రాబెర్రీలను పండించాడు. దీనికి గాను ధోనీకి తాజాగా బిర్సా అగ్రికల్చర్ యూనివర్సిటీ బెస్ట్ గోపాలక్ అవార్డు ఇచ్చింది. ఇది తెలుసుకున్న కెప్టెన్ కూల్ ఫ్యాన్స్.. క్రికెట్‌లోనే కాదు, రైతుగా కూడా తమ అభిమాన క్రికెట్ రాణిస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed