కల్వకుంట్ల కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతోంది : ABVP

by Sridhar Babu |   ( Updated:2021-12-15 05:22:46.0  )
కల్వకుంట్ల కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతోంది : ABVP
X

దిశ, పెద్దపల్లి : పెండింగ్‌లో ఉన్నటువంటి రూ. 3816 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఊషణ అన్వేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగా విద్యారంగ సమస్యలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు చెందుతాయని అనేకమంది విద్యార్థులు ఆత్మబలిదానం చేస్తే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం, విద్యార్థుల సమాధుల మీద పునాదులు నిర్మించుకోని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు.

అలాగే ఎంతో మంది నిరుద్యోగులు, ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి‌కి చీమకుట్టినట్టు కూడా కావడం లేదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగ నోటిఫికేషన్, రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాలుర, బాలికల కళాశాల సమీకృత వసతి గృహాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ABVP ,జిల్లా కన్వీనర్ కోడి అజయ్, నగర కార్యదర్శులు మారం సందీప్, రిషి, SFS జిల్లా కన్వీనర్ రాసూరి ప్రవీణ్, SFD జిల్లా కన్వీనర్ రేచవేణి సాగర్, జిల్లా మీడియా కన్వీనర్ మేడారం సాయికృష్ణ, నాయకులు బండి రాజశేఖర్, సాయితేజ, మనీషా, సాయి, నాగచంద్ర, ఓమెష్, బన్ని, బాలు, పవన్, అర్జున్, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed