- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బంగారం ఇవ్వని బ్యాంకు.. ఎస్‌బీఐ ముందు టెన్షన్ టెన్షన్
దిశ, ఖానాపూర్: గోల్డ్‌లోను కోసం పెట్టిన బంగారం తమకు ఇవ్వకపోవడంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎస్.బీ.ఐ. ఖానాపూర్ బ్రాంచ్ ముందు కుటుంబ సభ్యులతో బైఠాయించారు. వివరాల్లోకి వెలితే.. నిసర్ అహ్మద్ ఖానాపూర్ నివాసి ఖానాపూర్‌లోని ఎస్.బీ.ఐ బ్యాంకు లో గోల్డ్ లోన్ తీసుకున్నాడు. అతను మరణించడంతో కుటుంబ సభ్యులు లోన్ రూపాయలు 8 లక్షల రూపాయలు కట్టిన తర్వాత తమ బంగారం ఇవ్వాలని బ్యాంకు సిబ్బందిని కోరారు. కానీ, డిపాజిట్ దారుని భార్య నామిని డాక్యుమెంట్ కావాలని అడగగా ఇచ్చామని, కానీ అవి చెల్లవని కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరి డాక్యుమెంట్ కావాలని అడగారు. దీంతో మృతుని పెద్ద కుమారుడు ఫర్వాద్దీన్ డాక్యుమెంట్లు ఇచ్చి నెలరోజులు అయిన బ్యాంక్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదనం వ్యక్తం చేస్తూ బ్యాంక్ ముందు ధర్నా చేశారు. అరగంట పాటు బ్యాంక్ సేవలు నిలిచిపోయాయి. అనంతరం ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ ఫోన్ చేసి సోమవారం లోపు మీ బంగారం ఇస్తాం అని లబ్దిదారులతో మాట్లాడారు. దీంతో వారు దీక్ష విరమించారు.