- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒకే వేదికపై 16 జంటలు.. మూడు మతాల వివాహాలు
దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో 16 జంటలకు ఉచితంగా వివాహాలు జరిపించారు. సోమవారం ధర్మపురి సంజయ్ బర్త్ డే సందర్భంగా నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సాముహిక వివాహాలు నిర్వహించి, నూతన జంటలకు వస్తు సామాగ్రి అందచేశారు. ఈ వివాహ వేడుకలో రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ.. తాము తొలి నాళ్లలో ధర్మపురి చారి ట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సంజయ్ పుట్టినరోజున పేద జంటలకు ఉచిత వివాహాలను జరిపినట్లు గుర్తుచేశారు. ఒకటి, రెండు సంవత్సరాలు మినహా ప్రతి ఏడాది ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈసారి వినూత్నంగా అన్ని మతాల వివాహాలను ఒకే వేదికపై జరిపించడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర పుర ప్రముఖులు మాజీ మేయర్ సంజయ్‌ను, నూతన జంటలను ఆశీర్వదించారు.