- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ధర్మపురి సంజయ్.. షాక్‌లో టీఆర్ఎస్-బీజేపీ..!
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ మళ్లీ యాక్టివ్ పొలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. సొంత బలగాలను చేరదీస్తూ.. ప్రస్తుత రాజకీయాలపై అనుచరులతో సమావేశాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ హయాంలో కీలక నేత..
కాంగ్రెస్ హయాంలో(2004-2014) నిజామాబాద్ రాజకీయాల్లో క్రియా శీలకంగా ఉన్న ధర్మపురి సంజయ్.. ఉమ్మడి జిల్లాకు తొలి మేయర్‌గా విశిష్ట సేవలు చేశారు. ఇదే సమయంలో తండ్రి డీఎస్ కాంగ్రెస్‌లో కీలకంగా ఉండడంతో.. జిల్లా రాజకీయాల్లో తనదైన మార్క్ వేశారు. ఆది నుంచి దూకుడుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. జిల్లాలో పార్టీ పదవుల నుంచి అధికారిక కార్యక్రమాల్లో సంజయ్ మార్క్ కనిపించేది. పలు సందర్భాల్లో దూకుడుగా ఉంటూ.. తండ్రి మాటను లెక్కచేయడం లేదన్న అపవాదు కూడా తెచ్చుకున్నారు సంజయ్.
2009 నుంచే పతనం..
2009లో మేయర్ పదవి ముగియడం, రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ బలహీన పడటం, నిజామాబాద్ రూరల్ నుంచి 2014లో పోటీ చేసిన తండ్రి ధర్మపురి శ్రీనివాస రావు ఓటమితో సంజయ్ ప్రభావం కూడా తగ్గింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించి.. అధికారం చేపట్టింది. ఈ ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న సంజయ్.. విద్యా సంస్థలను నడుపుతూ వచ్చారు. ఇదే సమయంలో తనకు సంబంధించిన విద్యా సంస్థల్లో పలువురు విద్యార్థినిలపై వేధింపుల కేసు ఆయన్ను జైలు పాలు చేసింది. ఆ తర్వాత జైలు నుంచి తిరిగొచ్చినా ప్రత్యక్ష రాజకీయాలకు మొత్తానికే దూరం అయ్యారు. అప్పటికే తండ్రి డీఎస్ టీఆర్ఎస్‌లో చేరినా.. సంజయ్ మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ ఎంట్రీ..!
ముఖ్యంగా విద్యార్థినిల వేధింపుల కేసు వ్యవహారంతో ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు సంజయ్. అనాటి నుంచి నేటి వరకు మళ్లీ ఎప్పుడూ తెర మీదకు రాలేదు. తాజాగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సంజయ్ మళ్లీ యాక్టివ్ అవుతున్నట్టు సమాచారం. తన అనుచరులు, సన్నిహితులతో వరుసగా భేటీలు అవుతూ.. ఫుల్ బిజీ అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటి నుంచి కార్పొరేషన్ వరకు, తొలి మేయర్‌గా మంచి పేరుతెచ్చుకున్న సంజయ్‌కు.. ప్రస్తుతం జిల్లాలో కార్పొరేటర్లు, కీలక నాయకులు ఆయన అనుచరులుగా ఉన్నారు. వీరందరితో సంజయ్ సమాలోచనలు చేస్తుంటే.. బీజేపీ-టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడని అంశంగా మారింది. సంజయ్ మళ్లీ పొలిటిక్స్‌లో రీఎంట్రీ ఇస్తే వీరంతా ఆయన వెంటే నడిచే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2023 ఎన్నికలకు చాల సమయం ఉన్నప్పటికీ సంజయ్ ఇప్పటి నుంచే పావులు కదపడం చర్చనీయాంశం. ఇది ఇలా ఉంటే.. నిజామాబాద్ రాజకీయాలను అధికార టీఆర్ఎస్, బీజేపీ చేరో దిక్కుగా శాసిస్తున్నారు. అర్బన్ రాజకీయాల్లో అయితే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. దీనికితోడు తండ్రి డీఎస్ టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా.. సోదరుడు ధర్మపురి అర్వింద్ బీజేపీలో ఎంపీగా ఉన్నారు. అయితే, మొదటి నుంచి తండ్రి వెన్నంటే ఉన్న సంజయ్ టీఆర్ఎస్‌లో చేరుతారా లేదా అన్నది ఉత్కంఠను రేపుతోంది. మరోవైపు టీపీసీసీగా రేవంత్ రెడ్డి నియామకం కావడంతో సంజయ్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా.. పార్టీ మారుతారా.. అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.