- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిల.. మీరు ఆయన కూతురు అని మర్చిపోవద్దు: అర్వింద్
దిశ, తెలంగాణ బ్యూరో : తాటాకు బదులు ఈతాకులా పసుపు బోర్డు బదులు స్పైస్ బోర్డును కేటాయిస్తున్నారని వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. అసలు షర్మిలకు పసుపు ధరెంతో తెలుసా అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. షర్మిలకు తెలంగాణ రాజకీయాల్లోకి స్వాగతం అని చెబుతూనే.. ఆమె సమావేశాల్లో మాట్లాడే ముందు వైఎస్సార్ కూతురనే విషయాన్ని మర్చిపోవద్దని, సబ్జెక్టు మీద పూర్తి పరిజ్ఞానంతో మాట్లాడాలని సూచించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం పసుపు రైతులకు బోనస్ తో కలిపితే ఇచ్చిన ధర కేవలం రూ.6,850 రూపాయలు మాత్రమేనని ఆయన తెలిపారు. రాజేశేఖర్ రెడ్డి హయాంలో పసుపు దిగుమతి ధరలు పడిపోయి ఉంటే ఆ పరిస్థితులు రైతులకు రాకూడదని ఎగుమతులు భారీగా పెంచేలా కేంద్రం ఎన్నో మార్పులు చేసినట్లు స్పష్టం చేశారు.
గతేడాది కురిసిన అకాల వర్షాలు, అతి వర్షాల వల్ల పసుపు పంటకు నష్టం జరిగినా మేలు రకం పసుపునకు రూ.పది వేలకు పైగా ధర పలికిందని అన్నారు. ఈ రేటు ఏపీలో కంటే చాలా ఎక్కువ అని, అందుకే ఏపీ రైతులు నిజామాబాద్ కు వచ్చి మరీ లాభాలు పొందారని ఆయన పేర్కొన్నారు. రాజన్న రాజ్యానికి ఏపీ తెలంగాణలో అభిమానులున్నా.. తెలంగాణ ప్రజలు కోరుకునేది మాత్రం రామరాజ్యాన్నే అని ఎంపీ అర్వింద్ తెలిపారు. అంతేకాకుండా రామన్నరాజ్యానికి, రామరాజ్యానికి వ్యత్యాసాలను వివరించారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వ ఖజానా నుంచి బోనస్ ఇవ్వడం రాజన్న రాజ్యమని, రైతులు పడిన కష్టానికి మార్కెట్ లో అత్యధిక ధర అందించడం, అందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయడం రామరాజ్యమని, ఇక్కడ అవినీతి అనేదే ఉండదని ఎంపీ స్పష్టం చేశారు. సచిన్ టెండూల్కర్ కు కూతురు, కొడుకులున్నంత మాత్రాన వాళ్లు కూడా టెండూల్కర్ అవ్వాలని లేదు కదా అంటూ షర్మిలకు వ్యంగ్యంగా చురకలంటించారు.