మరో తెలుగు డైరెక్టర్‌కు ఓకే చెప్పిన ధనుష్..?

by Shyam |
మరో తెలుగు డైరెక్టర్‌కు ఓకే చెప్పిన ధనుష్..?
X

దిశ, సినిమా : కోలీవుడ్ హీరో ధనుష్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న క్రమంలో తను కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ ప్రాజెక్ట్‌ కంప్లీట్ చేసి హాలీవుడ్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న ధనుష్.. ఈ మధ్యే తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ములతో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. బైలింగువల్‌గా రూపొందుతున్న ఈ మూవీతో పాటు మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా టాలీవుడ్‌ డైరెక్టర్ వెంకీ అట్లూరితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. వెంకీ చెప్పిన స్టోరీ లైన్‌కు ఇంప్రెస్ అయిన ధనుష్.. గతంలో లేని విధంగా కొత్తగా ట్రై చేయబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.

Advertisement

Next Story