రెండ్రోజులకు ఒకసారి రావాలి

by Shyam |
రెండ్రోజులకు ఒకసారి రావాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బందిని ప్రతి 2 రోజులకు ఒకసారి విధులకు హాజరుకావాలని ఆదేశించింది. ఉద్యోగులంతా ఒకే రోజు ఆఫీసుకు రాకుండా కొంత మంది ఒక రోజు.. మరి కొంత మంది మరో రోజు విధులకు హాజరు కావాలని సూచించింది. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ప్రభుత్వం చేసిన సూచనల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. అందరూ ఒకేసారి కార్యాలయాలకు రావడం ద్వారా వ్యాధి వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, సెక్షన్ లలో పనిచేసే హోంగార్డులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. కాగా, 2 రోజుల్లో ఇంట్లో ఉన్న ఒక రోజును హాలీడేగా పరిగణించి వేరే ప్రాంతాలకు వెళ్లడానికి వీలు లేదని, ఉద్యోగులు ఫోన్‌లో అందుబాటులో ఉండాలని డీజీపీ కార్యాలయం సూచించింది.

Tags : telangana dgp office, alternate days, reporting in office

Advertisement

Next Story