వాళ్లను వదిలిపెట్టం: డీజీపీ గౌతమ్ సవాంగ్

by srinivas |
వాళ్లను వదిలిపెట్టం: డీజీపీ గౌతమ్ సవాంగ్
X

దిశ, వెబ్ డెస్క్: యువకుడి శిరోముండనం ఘటనపై విచారణ జురుగుతోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోందని, కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నేరానికి పాల్పడ్డవారు ఎంతటివారైనా చర్యలు తప్పవు అని డీజీపీ చెప్పారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర్లోని సీతానగరం పోలీస్ స్టేషన్ లో వెండుగమిల్లి ప్రసాద్ అనే దళిత యువకుడిని అవమానించారు. స్టేషన్లో ఇన్‌చార్జి ఎస్సై ఆ యువకుడికి ట్రిమ్మర్ తో గుండు చేయించారు. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటున్న సీతానగరం ఇన్‌చార్జి ఎస్సై షేక్ ఫిరోజ్, ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి అర్బన్ ఎస్పీ తెలిపిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఎస్సైను సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టినట్లు ఎస్పీ చెప్పిన విషయం విధతమే.

Advertisement

Next Story