- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది హోలీ ఎప్పుడొస్తుంది.. హోలికా దహనం ముహూర్తం ఎప్పుడంటే..
దిశ, ఫీచర్స్ : హోలీ పండుగ హిందువుల అత్యంత ప్రసిద్ధ పండుగ. ఫిబ్రవరి నెల ప్రారంభం కాగానే పిల్లలతో పాటు పెద్దలు కూడా హోలీ కోసం ఎదురుచూస్తుంటారు. స్నేహితులు, బంధువులు రంగులు చల్లుకుంటూ సంతోషంగా పండగను జరుపుకుంటారు. హోలీ పండుగను భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా వైభవంగా జరుపుకుంటారు.
ఈ ఏడాది కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఎన్నో రకాల రంగులతో హోలీ పండుగను జరుపుకోనున్నారు. హోలీ పండుగ ప్రతి సంవత్సరం మార్చి నెల వసంతకాలంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. హోలి పండగ శీతాకాలం ముగింపు, వేసవి ప్రారంభాన్ని సూచిస్తుంది. అయితే ఈ ఏడాది హోలీ తేదీలో వస్తుంది, శుభ సమయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హోలికా దహన్ 2024 శుభ సమయం..
ఈ సంవత్సరం కాముని పూర్ణిమ మార్చి 24, ఆదివారం వస్తుంది. ఈసారి హోలికా దహన్ శుభ సమయం అర్థరాత్రి 11:13 గంటలకు ప్రారంభమై 12:27 గంటలకు ముగుస్తుంది.
2024 లో హోలీ ఎప్పుడు?
హోలీ రంగుల పండుగ హోలికా దహన్ మరుసటి రోజున జరుపుకుంటారు. అందుకే ఈ ఏడాది 2024 సంవత్సరంలో హోలీని మార్చి 25వ తేదీ సోమవారం జరుపుకుంటారు.
హోలికా దహన్ పూజ పద్ధతి..
హోలికా దహనం రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి హోలికను ఉంచిన ప్రదేశంలో తూర్పు లేదా ఉత్తరం వైపున పూజలో కూర్చోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పూజా సామగ్రిలో పండ్లు, పువ్వులు, కొబ్బరి, రోలీ, బియ్యం, పచ్చి పత్తి లేదా కలవ, పసుపు, బటాషా, గులాల్, నీటిని ఒక కుండలో ఉంచండి. ఈ పూజా సామాగ్రితో హోళికను పూజించండి. ఆ తర్వాత పచ్చి పత్తి లేదా కలవా, నీటిని తీసుకుని, హోలిక కర్రల చుట్టూ చుట్టి, హోలికకు 7 సార్లు ప్రదక్షిణలు చేసి, నీటిని సమర్పించాలి.