- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Saphala Ekadashi : సఫల ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏంచేయాలంటే..?
దిశ, వెబ్ డెస్క్ : మార్గశిర మాసం కూడా విష్ణువుకు చాలా ఇష్టమైన మాసంగా చెబుతుంటారు. ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా మార్గశిర, శ్రావణం, కార్తీక మాసాలలో వచ్చే ఏకాదశి తిథి పర్వదినాలు.. శివ, కేశవులకు ఎంతో ఇష్టమైన తిథులుగా పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో ముఖ్యంగా ధనుర్మాసం తిరుప్పావ్ ఉత్సవాలు జరుగుతుంటాయి. విష్ణుదేవుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. అయితే, డిసెంబరు 26న సఫల ఏకాదశి జరుపుకోనున్నారు.
శ్రీమన్నారయణుడు ఈ తిథిని చాలా ఇష్ట పడతాడు. చాలా మంది ఈ ఏకాదశి రోజున పూజలు వ్రతాలు చేస్తుంటారు. ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచిగా ఉంటుంది. ఈ రోజున మీ ఇంటి దగ్గర్లో ఉన్న ఆలయాలకు వెళ్లి దీపారాధన చేయాలి. విష్ణువుకి ఐదురకాల పూలను సమర్పించాలి.
ఈ రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో .. వారి కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా, ఈ రోజున ఉపవాసం ఉంటే ఏడాది పాటు ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుంది. అలాగే, తెలియక చేసిన చేసిన పాపాలన్ని కూడా పోతాయని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ ఏకాదశిని అత్యంత పవిత్రమైందని చెప్తుంటారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.