TTD: శ్రీవారి భక్తులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వాట్సప్ నుంచి దర్శనం బుకింగ్ సేవలు!

by Shiva |
TTD: శ్రీవారి భక్తులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వాట్సప్ నుంచి దర్శనం బుకింగ్ సేవలు!
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీవారి భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఈ మేరకు త్వరలో వాట్సప్ (Whatsaap) నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులు ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు ఇటీవలే టీటీడీ (TTD) అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు (CM Chandrababu) వాట్సప్‌ నుంచి బుకింగ్ సౌకర్యం కల్పించే ప్రతిపాదనను అధికారుల దృష్టి తీసుకొచ్చారు. అయితే, అందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

అయితే, వివిధ రాష్ట్రాల నుంచి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గత రెండేళ్లలో విపరీతంగా పెరిగింది. అదేవిధంగా స్వామి వారి దర్శనాల్లో వీఐపీ, వీవీఐపీల సిఫార్సు లేఖల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అధికారులు వాట్సప్ బుకింగ్ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇక నుంచి ఎలాంటి రికమెండేషన్లతో పని లేకుండా సామాన్యులు కూడా సులభంగా శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. వాట్సప్ (Whatsaap) నుంచి దర్శనం బుకింగ్‌ను పైలెట్ ప్రాజెక్ట్ కింద తిరుమల నుంచి ప్రారంభించనున్నారు. ఒకే వేళ ఆ విధానం సక్సెస్ అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఇదే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు శ్రీవారి దర్శనంతో పాటు ఆర్జిత సేవల రేట్లను సైతం ప్రక్షాళన చేసి తక్కువ ఖర్చుతో వీలైనన్ని ఎక్కువ సౌకర్యాలు కల్పించేందుకు సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది.

Next Story

Most Viewed