Tirumala: తిరుమలలో స్వామివారి గర్భగుడి తలుపు తెరిచేది వీళ్లే.. ఎందుకంటే..?

by Prasanna |
Tirumala: తిరుమలలో స్వామివారి గర్భగుడి తలుపు తెరిచేది వీళ్లే.. ఎందుకంటే..?
X

దిశ,ఫీచర్స్: తిరుమల తిరుతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు అన్నీ.. ఇన్నీ కావు. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం. ఇక్కడ ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ముఖ్యంగా ఏ దేవాలయ తలపులైన వేకువ జామునే ఆలయ అర్చకులే తీస్తారు. ఇందుకు భిన్నంగా దేవదేవుని ఆలయం ద్వారం తీసేది మాత్రం యాదవుడు. ఆ తర్వాతే రోజు వారి కార్యక్రమాలు, తర తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయానికి , శ్రీనివాసుని చరిత్రకు మూలాలు ఉన్నాయి. వైకుంఠం వీడి భూలోకానికి వచ్చిన శ్రీనివాసుడు, లక్ష్మీ, దేవిని వెతుక్కుంటూ ఓ పుట్టలో తపోనిష్టుడయ్యాడు.లక్ష్మీ దేవి కోరిక మేరకు శ్రీనివాసుడు ఆకలిని తీర్చడానికి బ్రహ్మ, మహేశ్వరులు, ఆవు - దూడలుగా మారి చోళ రాజు గో సంపదలో చేరతారు. ఆ ఆవు - దూడని చూసి ముచ్చట పడిన చోళ రాణి గోవు పాలు ప్రతి రోజూ తనకిమ్మని పశువుల కాపరిని ఆదేశించింది. అన్ని గోవులతో కలిసి ఆవు శేషాచల అడవులకు ఆవు వెళ్ళేది. తర్వాత మంద నుంచి తప్పించుకుని పుట్టలోని శ్రీనివాసునికి పాలు జార విడిచింది. ప్రతిరోజూ ఇంతే..! ఇంటికి వెళ్ళాక పాలు పితికితే వచ్చేవి కావు. దీనితో రాణి ఆగ్రహం చూపిస్తుంది. మంద నుంచి తప్పించుకున్న ఆవును యాదవుడు కొట్టబోతాడు. అప్పుడు శ్రీనువాసుడు ప్రత్యక్షమవుతాడు. భూలకంలో తనని దర్శించిన యాదవ వంశీయులకే తన తొలి దర్శనం లభిస్తుందని శ్రీనివాసుడు వరమిస్తాడు. ప్రతి రోజూ బ్రహ్మ ముహూర్తంలో 02:30 గంటలకి సుప్రభాత సేవకు ముందు సన్నిధి గొల్ల సుచిత్ నాధుడే తిరునామం ధరించి గోవింద నామాని స్మరిస్తూ దివిటి పట్టుకుని ఉత్తర మాడ వీధుల్లో అర్చకుల తిరుమాళ్లకు వెళ్లి వారికి నమస్కరించి ఆలయానికి ఆహ్వానిస్తాడు.

Advertisement

Next Story

Most Viewed