Spirituality: శ్రావణమాసంలో శివుడికి ఈ వస్తువులు ఎట్టిపరిస్థిల్లోనూ సమర్పించకూడదు.. ఎందుకంటే?

by Anjali |
Spirituality: శ్రావణమాసంలో శివుడికి ఈ వస్తువులు ఎట్టిపరిస్థిల్లోనూ సమర్పించకూడదు.. ఎందుకంటే?
X

దిశ, ఫీచర్స్: శ్రావణ మాసం పరమశివుడికి ప్రత్యేకమైన మాసం. శ్రావణమాసంలో అందరూ భక్తిశ్రద్ధలతో భోళా శంకరుడ్ని కొలుస్తారు. నిష్ఠతో ఉపవాసాలు ఉంటారు. తము కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని వచ్చే నెల(ఆగస్టు)లో 4 సోమవారాలు వ్రతం, మంగళ గౌరీ, ప్రదోష వ్రతం, శ్రావణ శివ వ్రతం అనే నాలుగు రకాల వ్రతాలు చేసి ఫాస్టింగ్ ఉంటారు. యువతులందరూ మంచి భర్త రావాలని సోలా సోమవర్ వ్రత్ అనే వ్రతాన్ని చేస్తారు. అయితే శ్రావణమాసంలో శివుడ్ని పూజించే సమయంలో పలు పొరపాట్లు పొరపాటున కూడా చేయొద్దంటున్నారు జ్యోతిష్య పండితులు. పరమశివుడికి పలు వస్తువులు అస్సలు సమర్పించకూడదట. ఒకవేళ సమర్పించినట్లైతే శివుడు ఆగ్రహానికి గురవుతాడట. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పసుపు..

పసుపును కామన్‌గా అన్ని పూజలల్లో వాడుతారు. ఎన్నో రకాల రోగాలను నయం చేసే ఈ పసుపును భోళాశంకరుడికి మాత్రం సమర్పించకూడదంటున్నారు పండితులు. ఎందుకంటే ఈ దేవుడ్ని సన్యాసిగా చెబుతారు. కాగా ఎలాంటి సుఖాలను కోరుకోడు. పసుపు ఏమో సంతానోత్పత్తి, వివాహంలో ముడిపడి ఉంది. కాగా శ్రావణ మాసంలో శివయ్యకు పూజ చేసేటప్పుడు ఎట్టిపరిస్థితిల్లోనూ పసుపు వాడకపోవడం మంచిదంటున్నారు జ్యోతిష్య పండితులు.

* తులసి..

తులసి ఆకు మంచి ఔషధంగా చెబుతారు పెద్దలు. హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. తులసి శాస్త్రీయ నామం ఓసిమం టెన్యూఫ్లోరం. దీనికి రెండు రకాల జాతులున్నాయి. 1. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి. 2. కొంచెం లేత రంగులో ఉండే రామతులసి. అయితే సాధారణంగా పూజకు కృష్ణతులసిని వాడుతారు. కానీ శ్రావణమాసంలో తులసిని శివుడి పూజ కోసం మాత్రం ఉపయోగించకూడదట. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం.. తులసి రాక్షక రాజు జలంధరకు భార్య. ప్రపంచాన్ని జలంధరుడు నాశనం చేస్తోన్న సమయంలో భోళాశంకరుడు ఆయన్ను చంపాడట. కాగా తులసి ఆగ్రహించడంతో.. నా పూజలో ఇకనుంచి తులసిని వాడొద్దని శాపం పెట్టారట.

* కాంస్య కుండలోని నీరు..

శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఎట్టిపరిస్థితిల్లోనూ కాంస్య కుండలోని నీటిని ఉపయోగించకూడదట. సాధారణంగా శివయ్యకు పెరుగు, పంచామృతం, తేనె, గంగాజలం సమర్పిస్తారు. కానీ శ్రావణమాసంలో ఇవి సమర్పిస్తే అశుభంగా భావిస్తారు. వెండి, రాగి, మట్టి కుండల్లోని నీటిని శివుడి పూజ కోసం వాడితే మంచిదట.

* కుంకుమ..

శ్రావణమాసంలో శివయ్యకు పూజ చేసే సమయంలో కుంకుమ కూడా అస్సలు సమర్పించకూడదట. కామన్‌గా పెళ్లైన మహిళలు నుదిటిన కుంకుమ పెట్టుకుంటారన్న విషయం తెలిసిందే. శివుడు బస్మాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు కాబట్టి.. శ్రావణమాసంలో ఈ దేవుడికి కుంకుమ ఉపయోగించకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed