Jupiter: బృహస్పతికి ఇష్టమైన రాశులు ఇవే .. మీ రాశి ఉందా..?

by Prasanna |   ( Updated:2025-03-15 07:43:38.0  )
Jupiter: బృహస్పతికి ఇష్టమైన రాశులు ఇవే .. మీ రాశి ఉందా..?
X

దిశ, వెబ్ డెస్క్ : దేవ దేవుళ్ళకు ఇష్టమైన రాశులు ఎలా ఉంటాయో గ్రహాలకు కూడా ఇష్టమైన రాశులు అలాగే ఉంటాయి. ఈ గ్రహాన్ని శుభగ్రహంగా పరిగణిస్తారు. విద్య, సంపదకు సూచికగా భావిస్తారు. పురాణాల ప్రకారం, బృహస్పతి, శివుడికి కొన్నేళ్ళ పాటు తపస్సు చేయడం వలన దేవ గురువు పదవి పొందినట్లు చెబుతున్నారు. ఈ గ్రహం అనుగ్రహం ఉంటే అన్ని పనులు సాధిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, బృహస్పతికి ఇష్టమైన రాశులు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ధనస్సు రాశి

బృహస్పతికి ఇష్టమైన రాశుల్లో ధనస్సు రాశి కూడా ఒకటి.. ఈ రాశిలో పుట్టిన వారు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు. అంతేకాకుండా ఎలాంటి పనులు మొదలు పెట్టినా అవి సులభంగా విజయాలు సాధించగలుగుతారు. అలాగే, వీరు కష్ట పడిన దానికి తగిన ప్రతి ఫలం ఉంటుంది. కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు శివుడు ఆశీస్సులు ఉంటాయి. వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

సింహరాశి

బృహస్పతికి ఇష్టమైన రాశుల్లో సింహ రాశి కూడా ఒకటి. ఈ రాశి వారు అవమానాలు పడిన దానికి తగిన విజయాలు అలాగే ఉంటాయి. అందరితో సింహ రాశి వారు స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి, వీరికి శివుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. వీరు, ఎలాంటి పనులైన సులభంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వస్తుంది. దీని వలన కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Read More..

Budhaditya Raja Yoga : బుధాదిత్య రాజయోగం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

Next Story

Most Viewed