Bhakthi: భోగి పండుగ విశిష్టత.. గోదాదేవి కథ..

by Indraja |
Bhakthi: భోగి పండుగ విశిష్టత.. గోదాదేవి కథ..
X

దిశ వెబ్ డెస్క్: రేపటి నుండి సంక్రాంతి మొదలవుతుంది. మూడు రోజులు సాగే ముచ్చటైన ఈ పండుగ నేపథ్యంలో ఇప్పటికే ప్రజల సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే మకర సంక్రాంతి భోగి పండుతో మొదలవుతుంది అనే విషయం అందరికి సుపరిచితమే. అయితే భోగి పండుగ జరుపుకోవడం వెనుక కొన్ని పురాణ కథలు దాగి ఉన్నాయి. ఆ కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరులో భట్టనాథుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. అయితే భట్టనాథుడు ప్రతి నిత్యం క్రమం తప్పకుండా శ్రీ కృష్ణుడికి పుష్పాలను సమర్పించి భక్తి శ్రద్దలతో పూజించేవాడు.

దీనితో అక్కడి వారంతా భట్టనాథుడుని విష్ణుచిత్తుడు అని పిలిచే వారు. (విష్ణుచిత్తుడు అంతే విష్ణువును చిత్తశుద్ధితో ఆరాధించేవాడు అని అర్ధం. ) ఇక అయన భక్తి శ్రద్ధలను చూసిన ప్రజలు ఆయనకు పెరియాళ్వారు అనే బిరుదును కూడా ఇచ్చారు. అయితే ఒకసారి ఆ విష్ణుచిత్తుడు తులసి వనం పెంచాలని నిర్ణయించుకుని తోలసి మొక్కలను నాటడానికి పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. పిల్లలు లేని తనకు ఆ దైవమే ఆ పాపను ప్రసాదించాడని భావించి ఆ పాపకు కోదై అని పేరుపెట్టి గారాబంగా పెంచుకోసాగాడు. కోదై అంతే తమిళంలో పూలమాల అని అర్ధం. అయితే కోదై అనే పేరు కాలక్రమేణా గోదాగా మారింది.

అయితే చిన్నతనం నుండే శ్రీ కృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగింది గోదా. తన వయసు తో పాటుగా గోదా దేవికి శ్రీకృష్ణుని పై ఉన్న భక్తి పెరిగి అది ప్రేమగా మారింది. ఆ ప్రేమ తనను తాను మరిచిపోయేలా చేసింది.. ప్రస్తుతం తాను నివసిస్తున్న విల్లిపుత్తూరే ఒక్కప్పుడు ఆ బాల గోపాలుని గోపాలం(గోకులం) అని, తన స్నేహితురాళ్లంత గోపికలని, తాను గోపాలుని ప్రేయసిని అనుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండి విష్ణుమూర్తి కోసం తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ తాయారు చేసే పూల మాలలను మొదటగా తాను ధరించడం మొదలు పెట్టింది.

అయితే ఒకసారి గోదాదేవి అలా దేవుని మాలలు మొదటగా తాను ధరించడం చూసిన ఆమె తండ్రి, ఇన్నాళ్లు తన కూతురు ఇలా మొదట తాను ధరించిన పూల మాలలను ఆ భవంతునికి ధరిస్తున్ననా అనుకుని.. అపచారం చేశానని భాదపడుతూ నిద్రలోకి జారుకున్న విష్ణుచిత్తుడి కలలో ఆ విష్ణుమూర్తి కనిపించి.. తన కుమార్తె గోదాదేవి సాక్షాత్తు భూదేవి అని.. ఆమె ధరించిన మాలలను తనకి ధరించడం వల్ల ఎలాంటి అపచారం జరగదని.. ఇంకా తాను సంతోషిస్తానని చెప్పారు.

ఇలాంటి ఘటనలతో గోదాదేవి ప్రేమ మరింత పెరిగింది. దీనితో తనకు పెళ్లంటూ జరిగితే అది శ్రీకృష్ణునీతో మాత్రమే జరగాలని దృఢ నిర్ణయం తీసుకున్న గోదాదేవి అత్యంత కష్టమైన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. అలానే తన స్నేహితురాళ్లను కూడా ఆ వ్రతం ఆచరించేలా ప్రోస్తాహిస్తూ 30 పాశురాలను పాడింది గోదా. ఆ పాశురాలే ప్రస్తుతం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపిస్తున్న తిరుప్పావై. ఇక ఆ పరమభక్తురాలు గోదాదేవి భక్తికి, ప్రేమకి ఆ భగవంతుడు కూడా కరగిపోయాడు.

ఒక రోజు ఆమె తండ్రి కలలో కనిపించి.. గోదాదేవిని తాను పెళ్లి చేసుకుంటానని.. అందుకు గాను ఆమెను శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ తెలిపాడు. దీనితో ఆనందించిన గోదాదేవి తండ్రి ఊరి జనాన్ని వెంట పెట్టుకుని గోదాదేవిని శ్రీరంగానికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే వారి రాక గురించి ముందుగానే తెలుసుకున్న అర్చకులు అక్కడ వారికి కోసం ఎదురుచూడ సాగరు. ఇంతలో అక్కడికి చేరుకున్న వారిని అక్కడి అర్చకులు ఆలయంలోకి తీసుకువెళ్లారు. అనంతరం పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది.

ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు జరిగింది. అందుకే ఆమె గుర్తుగా ప్రతి ఏడాది భోగి మంటలు వేసి ఆమెను లక్ష్మి స్వరూపంగా భావించి పూజిస్తారు. ఇక విష్ణువు వామన రూపం ధరించి భలి చక్రవర్తిని పాతాలనికి తొక్కిన రోజుకూడా మకర సంక్రాంతి ముందు రోజే. అయితే వామన అవతారంలో ఉన్న విష్ణు మూర్తి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కిన తరువాత.. పాతాళానికి రాజుగా ఉండమని.. ప్రతి సంవత్సరం అదే రోజు భూమి పైకి రమ్మని.. అప్పుడు నీరాకను ఆనందిస్తూ ప్రజలు నీకు భోగిమంటలతో స్వాగతం పలుకుతారని వరం ఇస్తాడు. అందకే మనం భోగి మంటలు వేస్తాం అనే కథ కూడా ప్రచారంలో ఉంది.

అయితే భోమంటలు వేయడం వల్ల వాతావరణం లోని సూక్ష్ణ క్రిములు నశిస్తాయి. ఇక ఆరోజు చిన్న పిల్లలకు తల పైన భోగి పళ్ళు పోస్తారు. ఇలా చేయడం వల్ల రేగిపళ్ళలో ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి పిల్లలకు అందుతుంది. అలానే రేగిపళ్ళు ఆరోయానికి కూడా చాలా మంచిది. అందుకే రేగిపళ్ళను పిల్లల తలపైన పోస్తారు. అయితే దీనికి వయసుతో సంబంధం లేదు ఎవరైనా పోసుకోవచ్చు. ఇక భోగి రోజు పోస్తారు కనుక భోగిపళ్లు అంటారు.


గమనిక: పైన తెలిపిన వివరాలను ‘దిశ’ ధ్రువీకరించడం లేదు. ఇంటర్ నెట్‌లో లభించిన సమాచారం ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. దీనికి ‘దిశ’కు ఎలాంటి సంబంధం లేదు

Advertisement

Next Story

Most Viewed