- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహా శివరాత్రి రోజున మాత్రమే తెరిచే శివాలయం ఎక్కడుందో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: మహాశివరాత్రి రోజున శివుడిని ఎంతో నిష్టగా భక్తి శ్రద్దలతో పూజిస్తారు. పరమశివుడిని దర్శించుకునేందుకు శివాలయాలకు కుటుంబ సమేతంగా తరలివెళ్తారు. అయితే సాధారణంగా అన్ని ఆలయాలు ఓ ప్రత్యేక సమయం వరకు తెరచే ఉంటాయి. కానీ, మధ్యప్రదేశ్‌లో ఉన్న ఓ ఆలయం శివరాత్రి రోజు మాత్రమే తెరుచుకుంటుందట.
వివరాల ప్రకారం.. మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమేశ్వర ఆలయం శివరాత్రి ఒక్కరోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఈ దేవాలయాన్ని 1543లో షేర్ షా సూరి అనే వ్యక్తి సోమేశ్వర ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారట. ఆ తర్వాత 1974లో దేవాలయాన్ని తెరవాలని ఉద్యమం చేశారట. అయితే అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సేథీ ఈ ఆలయం తలుపులు తెరచి సామాన్య ప్రజలు దర్శించుకునేందుకు అనుమతినిచ్చారు. కానీ, కేవలం శివరాత్రి రోజున మాత్రమే దేవాలయాన్ని తెరచి పూజలు చేసేందుకు అనుమతించారని సమాచారం. దీంతో అప్పటి నుండి ఇదే ఆచారం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మహాశివరాత్రి రోజున సోమేశ్వర ఆలయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది.
Read more :
Maha Shivratri : శివరాత్రి రోజు ఉపవాసం ఉంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!