Maha Shivratri : శివరాత్రి రోజు ఉపవాసం ఉంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

by samatah |   ( Updated:2023-02-17 06:30:52.0  )
Maha Shivratri : శివరాత్రి రోజు ఉపవాసం ఉంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
X

దిశ, వెబ్‌డెస్క్ : శివరాత్రి ఎంతో పర్వదినం. ఈ రోజున శివున్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. ఉపావాసం ఉంటూ కైలాస మూర్తిని ఆరాధిస్తుంటారు. ఇక ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ దీక్ష చేస్తే మంచి జరుగుతుందని భావిస్తుంటారు. కానీ ఈ ఉపవాసం ఉండటం వలన అనారోగ్య సమస్యలు దరి చేరే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందువలన ఉపవాసం ఉన్న సమయంలో కనీస జాగ్రత్తలు పాటించాలంట, అవి ఏంటో చూద్దాం.

ఉపవాసం ఉండే వారు ఒక రోజు ముందు అతిగా ఆహారం తీసుకుంటారు. అయిలే అలా తినడం మంచిది కాదంట. దాని వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉందంట. అలాగే బరువు పెరగడం, జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుందంట. అలాగే చాలా మంది ఉపవాసం ఉన్న సమయంలో నీరు కూడా తాగరు. అయితే రోజంతా అన్నం తినకుండనైనా ఉండగలం కానీ నీరు తాగకుండా ఉండలేం, రోజంతా నీళ్లు తాగకుండా ఉండటం వలన శరీరం తన స్థితిని కోల్పోతుంది. అందువల్ల కనీసం ఒకటి, రెండు సార్లు అయినా నీళ్లు తాగాలంట.

అయితే మరికొంత మంది నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేస్తుంటారు అయితే ఇలా నీరు మాత్రమే తాగి ఉపవాసం చేసే వారు గొరు వెచ్చని నీళ్లు మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. అలాగే శరీరానికి తక్షణ శక్తి అనేది అవసరం కాబట్టి వీలైతే జ్యూస్ తీసుకోవడం వలన ఆరోగ్యం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదంట. కావునా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాసం చేయడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Advertisement

Next Story