- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూలై 17న తొలి ఏకాదశి.. ఆ రోజున చేయాల్సిన, చేయకూడని పనులివే
దిశ, ఫీచర్స్: హిందువులకు ఈ ఏకాదశి తిథి ప్రత్యేకమైనది. కృష్ణ, శుక్ల పక్ష ఏకాదశి తిథిలు విశ్వాన్ని పోషించే శ్రీహరికి అంకితం చేసారు. అంతే కాకుండా కష్టాల నుంచి బయటపడటానికి ఈ రోజున ఉపవాసం కూడా చేస్తారు. ఏకాదశి వ్రతాన్ని చేయడం ద్వారా పోయిన జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు. దేవశయని ఏకాదశి ఉపవాసం లేదా ఆషాఢ మాసంలో మొదటి ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది.
తొలి ఏకాదశి 2024 లో ఎప్పుడు వచ్చిందంటే
హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 16 న రాత్రి 8:33 గంటలకు మొదలయి జూలై 17వ బుధవారం రాత్రి 09:02 గంటల వరకు ఉంటుంది.
ఏకాదశి రోజున చేయాల్సిన పనులు
తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. విష్ణువు, లక్ష్మీ దేవిని భక్తితో పూజించాలి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటానని దేవుని ముందు ప్రతిజ్ఞ చేయాలి. మీరు డబ్బు, ధాన్యాలు దానం చేయాలి. విష్ణువుకు నైవేద్యాలలో తులసి ఆకులను చేర్చాలి.
ఏకాదశి రోజున చేయకూడని పనులు
ఏకాదశి నాడు మసాలా ఫుడ్స్ ను తినకూడదు. ఈ రోజున స్త్రీలను, పెద్దలను అవమానించకండి. తులసి మొక్కల నుంచి ఆకులను అసలు కోయకండి. ఉపవాసం చేసేవారు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు.