- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రిపూట గుడ్లగూబను చూడటం శుభమా, అశుభమా..
దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో జంతువులు, పక్షులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పక్షులు, జంతువులు శుభ, అశుభకర విషయాలను సూచిస్తాయని అనేక నమ్మకాలు ఉన్నాయి. ఈ పక్షుల్లో గుడ్లగూబ కూడా ఉంది. ఇవి ఎక్కువగా రాత్రిపూట మాత్రమే సంచరిస్తూ ప్రజలకు కనిపిస్తాయి. సనాతన ధర్మం ప్రకారం గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా భావించి కొలుస్తారు. గుడ్లగూబను చూస్తే శుభం అని కొంతమంది, అశుభం అని కొంతమంది నమ్ముతారు. ఇంతకీ ఈ రెండిటిలో ఏది నిజం. శాస్త్రాలు, పండితులు అసలు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది ఇప్పటి వరకు నలుపు లేదా గోధుమ రంగు గుడ్లగూబలను చూసి ఉంటారు. కానీ పురాణాల ప్రకారం రాత్రుల్లు తెల్ల గుడ్లగూబను చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు. తెల్ల గుడ్లగూబలు అరుదుగా కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు. కానీ తెల్లగుడ్లగూబను చూస్తే, జీవితంలోని సమస్యలన్నీ తీరిపోతాయని, శుభం జరగనుందని నమ్ముతారు. హిందూ మతంలో తెల్ల గుడ్లగూబను పూర్వీకుల ఆత్మగా పరిగణిస్తారు. తెల్ల గుడ్లగూబను ఎవరైనా చూస్తే వారి పూర్వీకులు వారితో ఉన్నారని ఒక నమ్ముతారట.
గుడ్లగూబలను తరచుగా చూడటం..
వాస్తు శాస్త్రం ప్రకారం గుడ్లగూబను అకస్మాత్తుగా రాత్రిపూట చూసినట్లయితే అది మీ జీవితంలో ఆనందానికి సంకేతం. మీ జీవితంలో కలిగిన ఆర్థిక సమస్యలు త్వరలో తొలగిపోతాయనడానికి ఇది సంకేతం అని నమ్ముతారు. ఎవరైనా ఏదైనా పని కోసం బయటకు వెళుతున్న సమయంలో గుడ్లగూబ కనిపిస్తే శుభప్రదంగా పరిగణిస్తారు. అంతే కాదు వారు చేయబోయే పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుందని నమ్ముతారు.
పగటిపూట గుడ్లగూబను చూడటం..
గుడ్లగూబలు తరచుగా రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయని నమ్ముతారు. కానీ పగటిపూట కనిపిస్తే అది కూడా శుభప్రదంగా భావిస్తారు. పగటిపూట గుడ్లగూబలు కనిపిస్తే దాన్ని చూసిన వారి జీవితంలో ఏదో మంచి జరగబోతోందని అర్థం. గుడ్లగూబలను చాలా తక్కువ మంది మాత్రమే చూస్తారు.రాత్రిపూట గుడ్లగూబను చూస్తే ఇబ్బందులు తొలగిపోతాయని, కెరీర్‌లో పురోగతి కనిపిస్తుందని చెబుతారు. అలాగే రాత్రి గుడ్లగూబ శబ్దాలను వింటే శుభవార్తలు వింటారని పండితులు చెబుతున్నారు.