- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Poli Padyami: నదీ తీరాల్లో పోలి పాడ్యమి శోభ.. ఆ కథేంటో తెలుసా ?
దిశ, వెబ్ డెస్క్: కార్తీక మాసం (Karthika Masam) ముగిసింది. కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి (Poli Padyami) అంటారు. ఈ రోజున తెల్లవారుజామునే మహిళలంతా చెరువులు, నదుల్లో స్నానాలు చేసి దీపాలను వదులుతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ వ్యాప్తంగా ఉన్న నదీ తీరాల్లో పోలి పాడ్యమి శోభ కనిపించింది. అసలు ఈ పోలి పాడ్యమిని ఎందుకు జరుపుకుంటారు. ఎవరు ఈ పోలి అనే విషయాలను తెలుసుకుందాం.
పోలి పాడ్యమిని పోలి స్వర్గం (Poli Swargam) అని కూడా అంటారు. కార్తీక మాసమంతా దీపాలు వెలిగించి శివుడిని పూజించిన వారు ఈ రోజున ప్రత్యేక పూజలు చేశారు. పోలిపాడ్యమినాడు 30 ఒత్తులతో అరటి డొప్పలలో దీపాలను వెలిగిస్తారు. వాటిని ప్రవహించే నదుల్లో వదలుతారు. అనంతరం పోలి స్వర్గం కథను విని.. అక్షింతలు వేసుకుంటారు.
రజక వర్గానికి చెందిన స్త్రీ కి నలుగురు కొడుకులు, కోడళ్లు ఉండేవారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ముగ్గురు కోడళ్లతో కలిసి నదీ స్నానానికి వెళ్లి, దీపం పెట్టి ఇంటికి వచ్చేది. ఇంటి చాకిరి మొత్తాన్ని నాలుగో కోడలైన పోలికి అప్పచెప్పేది. వాళ్లతో పాటే తనకు కూడా నదీస్నానం చేసి, దీపాలు పెట్టాలన్న కోరిక ఉన్నా.. తనను తీసుకు వెళ్లేది కాదు అత్తగారు. ఓ సారి కార్తీక అమావాస్య రోజున తానెలాగైనా దీపం పెట్టాలనుకుంది. మజ్జిగ చిలికిన కవ్వానికి ఉన్న వెన్నను తీసి, పెరటిలో పత్తి చెట్టు నుంచి రాలి కిందపడిన పత్తికాడనుంచి ఒత్తి చేసి, పెరటిలో ఉన్న బావివద్ద స్నానం చేసి దీపం వెలిగించింది పోలి. ఆ దీపాన్ని అత్తగారు చూడకుండా.. పైన ఒక చాకలి బానను బోర్లించింది. ఇంతలో హఠాత్తుగా ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం పుష్పక విమానంలో వచ్చి.. ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లారు.
పోలి స్వర్గానికి వెళ్తుందని అందరూ అంటుంటే అత్తగారు, ముగ్గురు తోటికోడళ్లు చూశారు. ఆమె కాళ్లు పట్టుకుని వెళ్లబోగా విష్ణుమూర్తి అడ్డుపడి.. భక్తి, శ్రద్ధలేకుండా వెలిగించిన దీపాలకంటే.. భక్తితో వెలిగించిన ఒక్క దీపం చాలని చెబుతాడు. నీవు అడవుల పాలై పొమ్ము అని శపిస్తాడు. ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే.. కార్తీక మాసమంతా పురాణ పఠనం చేసిన ఫలితం కలుగుతుందని నమ్మిక. దీన్నే పోలి పాడ్యమి అంటారు. అందుకే మహిళలు నదుల్లో దీపాలను వదులి, ఆ తర్వాత శివుడిని పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి.