- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే 23 న వైశాఖ పౌర్ణమి ఆ రోజున ఈ చెట్టుని పూజిస్తే.. దోషాల నుంచి విముక్తి పొందుతారు!
దిశ, ఫీచర్స్: వైశాఖ పౌర్ణమికి హిందూమతంలో ప్రత్యేకత ఉంది. ఈ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది వైశాఖ పూర్ణిమ గురువారం, మే 23 న వస్తుంది. ఈ రోజున నదీ స్నానానికి, దానాలకు ప్రాముఖ్యత ఉంది. వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
పురాణాల ప్రకారం, వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజించడం చాలా మంచిది. ఈ రోజు రావి చెట్టును పూజించిన భక్తులకు విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. పూర్వీకుల కూడా సంతోషిస్తారని చెబుతారు. హిందూ గ్రంధాల ప్రకారం, ఈ రోజున ఒక చెట్టును నాటడం వలన బృహస్పతి నుంచి ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి పొందుతారు.
హిందూ మతంలో పౌర్ణమికి ప్రత్యేక అర్థం ఉంటుంది. మత గ్రంథాలలో, సంవత్సరంలోని పన్నెండు పన్నెండు పౌర్ణమి తిధులకు ప్రత్యేకత ఉంది. కానీ, వైశాఖ మాసంలో విష్ణువు పాటు రావి చెట్టును కూడా పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే శ్రీ హరి రవి ఈ వృక్షంలోనే ఉంటాడని నమ్ముతారు. అందువల్ల, వైశాఖ పూర్ణిమ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.