పాపమోచని ఏకాదశి నాడు విష్ణువును ఇలా పూజిస్తే కోరికలు నెరవేరుతాయట..

by Sumithra |   ( Updated:2024-04-01 07:55:56.0  )
పాపమోచని ఏకాదశి నాడు విష్ణువును ఇలా పూజిస్తే కోరికలు నెరవేరుతాయట..
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో, మహిళలు ప్రతి ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉంటారు. విష్ణువును భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ప్రతి సంవత్సరం పాపమోచని ఏకాదశి ఉపవాసం చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. పాపమోచని ఏకాదశి వ్రతంలో విష్ణు చాలీసా పఠించడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ పారాయణం చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరడంతో పాటు జీవితంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

ఈ సారి పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఏప్రిల్ 05న జరుపుకుంటారు. పాపమోచని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును, సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీనితో పాటు శుభఫలితాలను పొందడానికి ఉపవాసం కూడా పాటిస్తారు. ఇలా చేయడం వల్ల భక్తులు సుఖశాంతులు పొందుతారని, విష్ణువు, లక్ష్మిదేవి ప్రసన్నులవుతారని నమ్ముతారు.

పాపమోచని ఏకాదశి శుభ సమయం

ఈ సంవత్సరం పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఏప్రిల్ 5వ తేదీన జరుపుకుంటారు. పాపమోచని ఏకాదశి తేదీ ఏప్రిల్ 4న సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మార్చి 5 మధ్యాహ్నం 1:28 గంటలకు ముగుస్తుంది. అందుచేత ఉదయ తిథి ప్రకారం పాపమోచని ఏకాదశి వ్రతం ఏప్రిల్ 5వ తేదీ.

పాపమోచని ఏకాదశి పూజా విధానం..

పాపమోచని ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయాలి.

దీని తరువాత, ఇంటి పూజాగదిని శుభ్రం చేసి విష్ణువుమూర్తి, లక్ష్మిదేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలి.

విష్ణుమూర్తికి పంచామృతంతో అభిషేకం చేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పసుపు పూల మాల సమర్పించాలి.

విష్ణువు పూజలో తులసి ఆకులను తప్పకుండా పెట్టాలి.

విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి, విష్ణు చాలీసా పారాయణం చేసి, చివరిగా ఆరతితో పూజను ముగించాలి.

పాపమోచని ఏకాదశి ప్రాముఖ్యత..

పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల రోగాలు దూరమవుతాయని, వారికి సంతానం కలుగుతుందని హిందూ మతంలో ఒక నమ్మకం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తుల మానసిక సమస్యలన్నీ దూరమవుతాయని. దీనితో పాటు, ఈ ఉపవాసం ప్రజలను పాపాల నుండి కూడా విముక్తి చేస్తుందని చెబుతారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed