Shani Dev: శని చెడు దృష్టి నుంచి తప్పించుకోవాలంటే ఈ చిన్న పని చేయండి చాలు..!

by Prasanna |   ( Updated:2024-11-11 06:38:49.0  )
Shani Dev: శని చెడు దృష్టి నుంచి తప్పించుకోవాలంటే ఈ చిన్న పని చేయండి చాలు..!
X

దిశ, వెబ్ డెస్క్ : శని ( Shani Dev) అనుగ్రహం ఉంటే మనతో అన్నీ ఉన్నట్టే అని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొందరికి అంతా మంచిగున్నా సరే మొదలు పెట్టిన పనులు ముందుకెళ్ళవు. ఆ సమయంలో శని చెడు దృష్టి మీ పైన ఉందని అర్థం చేసుకోండి. శని దేవుడు చేసిన కర్మలను ( Karma) బట్టి ఫలితాలను ఇస్తుంటారు. శని శుభదృష్టి మీ మీద ఉంటే శుభంగా ఉంటుంది, అశుభ దృష్టి ఉంటే చెడు జరుగుతుంది. అలాగే, శుభకార్యాలకు కూడా అడ్డంకి వస్తుంది. ఏ పనులు కూడా ముందుకు సాగవు, అనారోగ్య సమస్యలువస్తాయి. శని దేవుడు ఒక్కో రాశికి వారికీ ఒక్కోలా ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే, శని ( Shani Dev) చెడు దృష్టి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని పనులు చేయాలనీ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

శనివారం రోజూ వెంకటేశ్వర స్వామి( Lord Venkateswara), నవగ్రహలా చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శని నుంచి బయటపడవచ్చని పండితులు తెలిపారు. ఇలా చేయడం వల్ల శని దేవుడు శాంతిస్తాడని అంటున్నారు.

వెంకటేశ్వర స్వామి ( Lord Venkateswara) , ఆంజనేయ స్వామి( Anjaneya Swamy) వారిని పూజిస్తే శని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అంతేకాకుండా, శివుడి పూజ చేసే వారిపైనే శని శుభ దృష్టి ఉంటుంది. శని కృప మీ పైన ఉండాలంటే శనివారం రోజున నల్లని దుస్తులను ధరించి ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల శని చెడు దృష్టి మీ మీద పడకుండా ఉంటుంది. అలాగే, ఈ రోజున పేదవారికి అన్నదానం చేయాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed