గురు పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు

by Prasanna |
గురు పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు
X

దిశ, ఫీచర్స్: ప్రతీ ఏడాది ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమిని గురుపూర్ణిమగా జరుపుకుంటాం. హిందూ సంప్రాయంలో గురుపూర్ణిమ చాలా విశిష్టమైనది. ఈ సంవత్సరం గురు పూర్ణిమ ఈ నెల 21 న వచ్చింది. ఈ గురుపౌర్ణమి రోజున మీరు వీటిని చేస్తే విష్ణువుతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు.

కొంతమంది వ్యాపారాల్లో నష్టపోతారు. వారు ఎంత డబ్బు పెట్టిన ప్రయోజనం ఉండదు ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటారు.ఇలాంటి వారు గురుపూర్ణిమ రోజు గురు యంత్రాన్ని ఇంట్లోకి తెచ్చి ప్రతి గురువారం పూజిస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి లాభాలు పొందుతారు.

గురు పూర్ణిమ రోజు దానాలు చేయడం వలన సంపద పెరుగుతుంది. ఈశాన్య దిక్కు బృహస్పతితో కలిసి ఉన్నందున, ఈ దిక్కును శుద్ధి చేసి నెయ్యి దీపం వెలిగించడం వల్ల వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. పసుపు వస్త్రాలు, తియ్యటి స్వీట్లు, నెయ్యిని గురు పూర్ణిమ రోజు దానం చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు. అలాగే ఈ రోజున మీకు ఇష్టమైన గురువును ఇంటికి ఆహ్వానించి మంచి విందును ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వలనజాతకంలో గురుగ్రహం బలపడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు

Advertisement

Next Story

Most Viewed