తిరుమల భక్తులకు భారీ గుడ్ న్యూస్..

by Hamsa |   ( Updated:2023-10-02 04:46:46.0  )
తిరుమల భక్తులకు భారీ గుడ్ న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం తరచూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్, అప్‌గ్రేడ్ అవుతూ ఉంటుంది. నేడు తిరుమల భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. పే లింక్ sms ద్వారా మనీ పే విధానంలో మార్పులు చేర్పులు చేస్తుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు టికెట్ల కేటాయింపుల నగదు చెల్లింపులను పే లింక్ ద్వారా భక్తులు చేస్తుండగా.. దీన్ని వీఐపీ బ్రేక్ దర్శనం, ఇతర సేవలు, గదులు బుకింగ్‌కు అమలు చేయనుంది. పే లింక్ sms పంపితే.. వారు దానిపై క్లిక్ చేసి డబ్బులు చెల్లించవచ్చును. ఇదిలా ఉంటే దర్శనానికి వేచి ఉండే భక్తులతో క్యూలైన్‌ ఐదు కిలోమీటర్ల మేరకు వ్యాపించాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లన్నీ సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. కళ్యాణ వేదిక నుంచి నారాయణగిరి వరకు భక్తులను దశలవారీగా ముందుకు పంపుతున్నారు. వీరికి దాదాపు 48 గంటల దర్శన సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. రద్దీ కొనసాగుతూనే ఉన్న క్రమంలో రెండో తేదీ కూడా తిరుపతిలో జారీ చేసే ఎస్‌ఎ్సడీ (స్లాటెడ్‌ సర్వదర్శన) టోకెన్ల జారీని రద్దు చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story