అద్భుతమైన హస్తకళా నైపుణ్యంతో ఆలయ నిర్మాణం.. దీన్ని ఎలా కట్టారో తెలుసా..

by Sumithra |
అద్భుతమైన హస్తకళా నైపుణ్యంతో ఆలయ నిర్మాణం.. దీన్ని ఎలా కట్టారో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : దైవభూమి హరిద్వార్‌లో అనేక దేవాలయాలు నెలకొని ఉన్నాయి. ఇక్కడ ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అన్ని ఆలయాల నిర్మాణం ఎలా ఉన్నా ఈ ప్రాంతంలో ఉన్న ఓ ఆలయ నిర్మాణంలో మాత్రం ఇనుము, సిమెంట్ ను మాత్రం అస్సలు ఉపయోగించలేదట. ఏండ్లు గడుస్తున్నా ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా అద్భుతంగా ఉంది. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు భక్తులు మైమరచిపోతారు. అయితే ఈ మహా దేవాలయం నిర్మాణంలో ఏ వస్తువులు ఉపయోగించారనే ప్రశ్న తలెత్తుతోంది.

శ్రీ యంత్ర ఆలయం హరిద్వార్..

హరిద్వార్ ని హిందువుల విశ్వాస కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ గంగానది ఒడ్డున అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి శ్రీ యంత్ర ఆలయం. ఈ ఆలయం గంగా నది ఒడ్డున ఉన్న కంఖాల్‌లో ఉంది. ఈ ఆలయం శక్తి ఆరాధన కేంద్రాలలో ఒకటి. సాధన చేసుకునేందుకు అద్భుతమైన ప్రదేశంగా భావిస్తారు. ఈ ఆలయంలో సాధన, హవన, యాగ, పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

సిమెంట్ - ఇనుము ఉపయోగించలేదు..

హరిద్వార్‌లోని శ్రీ యంత్ర దేవాలయం గోపురంతో ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం మిగిలిన వాటి కంటే ప్రత్యేకంగా, బిన్నంగా ఉంటుంది. ఆలయ బయటి గోడలు, రిహద్దుల పై నక్షత్రాల నమూనాలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా, అందంగా ఉంటుంది.

ఆలయ అందాలు, అద్భుతమైన చెక్కడాలు చూస్తుంటే ఇనుము, సిమెంటు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఏయే సామాగ్రి ఉపయోగించారో కనిపెట్టడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఈ ఆలయం రాజస్థాన్‌లోని అత్యుత్తమ రాళ్లతో నిర్మించారని కొన్ని పరిశోధనలు తెలిపాయి.

మా లక్ష్మి శ్రీ యంత్రం..

ఈ ఆలయం లక్ష్మీ దేవికి అంకితం చేశారు. ఇక్కడ లక్ష్మీ దేవి శ్రీ యంత్రాన్ని కూడా ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఈ ఆలయానికి శ్రీ యంత్ర ఆలయం అని పేరు వచ్చింది. ఈ అమ్మవారి ఆలయం ఇక్కడ ఉన్న 10 మహావిద్యలలో మూడవ స్థానంలో ఉంది. బాలా త్రిపుర సుందరితో పాటు మా కాళి విగ్రహం కూడా బంగారంతో తయారు చేసి ఉంటుంది. ఈ రెండు విగ్రహాలే కాకుండా లక్ష్మీ, సరస్వతీ దేవి విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. అలాగే ఈ ఆలయంలో శివుని వెండి విగ్రహం ప్రతిష్టించారు. ఈ ఆలయంలో రెండు శ్రీ యంత్రాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed