- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hanuman : రాముడు గోటితో గీసిన ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడంటే ?
దిశ, వెబ్ డెస్క్ : త్రేతా యుగంలో దశరధునందనుడైన శ్రీరామ చంద్ర మూర్తి వనవాస కాలంలో స్వహస్తాలతో తన బాణపు కోనతో గీసిన ఆంజనేయస్వామియే నేడు గండి ఆంజినేయుడిగా పూజలు అందుకుంటున్నాడు. కడప జిల్లాలోని రాయచోటి వెంపల్లి మార్గం మధ్యలో పాపాగ్ని నదీ తీరాన గండి క్షేత్రాన వెలసింది. పాపాగ్ని నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి పడింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అనే పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఆంజనేయ స్వామి వారికి పవిత్ర క్షేత్రాలు చాలానే ఉన్నా వాటిలో గండి క్షేత్రం అత్యంత పురాతనమైనది.
మహా వీరుడు, దశరథ తనయుడైన రాముడు గండి ప్రాంతంలో బస చేసాడు. ఆ సమయంలో హనుమంతుడును తలచుకుంటూ శ్రీరాముడు ఒక కొండపై ఆంజనేయ ఆకారాన్ని తన బాణంతో గీశాడు. తిరిగి వెళ్లే హడావిడిలో శ్రీరాముడు ఆంజనేయ రూపాన్ని అంతా గీసిన ఎడమ చేతి చిటికిన వేలును మాత్రం గీయపోవడంపై అసంపూర్తిగా మిగిలిపోయింది. గండి క్షేత్రంలో ఆంజనేయుని రూపం అభయ హస్తంతో ఉంటుంది. తనని భక్తితో కొలిచిన వారికి అభయమే ఇవ్వడమే కాకుండా .. వారిని సత్య మార్గంలో నడిపిస్తాడన్నది తర తరాలుగా భక్తుల నమ్మకం.