జూన్ నెల కలిసి వచ్చే రాశులు ఇవే.. వీరికి ఈ నెల మొత్తం సంతోషం, ధనప్రాప్తి!

by Jakkula Samataha |
జూన్ నెల కలిసి వచ్చే రాశులు ఇవే.. వీరికి ఈ నెల మొత్తం సంతోషం, ధనప్రాప్తి!
X

దిశ, ఫీచర్స్ : జూన్ నెల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ నెలలో అనేక గ్రహాల సంచారం జరుగుతుంది. అంతే కాకుండా ఈ నెల మొదటి రోజే మేష రాశిలో కుజుడు ప్రవేశించాడు. అలాగే బుధుడు కూడా తన రాశులను మార్చుకుంటున్నాడు. అదే విధంగా మిథునంలో మరోసారి సూర్య, బుధ గ్రహాల సంయోగం జరుగుతుంది. దీంతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఈ యోగం ఆరు రాశుల వారికి అద్భుత ఫలితాలు ఇస్తుంది. దీంతో ఈ నెల మొత్తం ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

సింహ రాశి : బుధాదిత్య యోగం వలన సింహ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, ధనప్రాప్తి, ఆరోగ్యం బాగుండడం వంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారు ఈ నెల మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. ఎందులో పెట్టుబడులు పెట్టినా వీరికి కలిసి వస్తుంది.

మిథున రాశి : ఈ రాశి వారికి ఈ నెల మొత్తం పట్టిందల్లా బంగారం కానుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇంటా బయట చాలా సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. కష్టాలన్నీ తొలగిపోయే ఛాన్స్ ఉంది.

కన్యారాశి : బుధాదిత్య యోగం వలన కన్యారాశి వారికి వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగంలో పురోగతి, జీతం పెంపుదల, ప్రమోషన్స్ రావడం వంటివి జరగడమే కాకుండా, వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు అప్పుల బాధల నుంచి బయటపడతారు. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వైవాహిక బంధం లో సమస్యలు తొలిగిపోయి సంతోషంగా గడుపుతారు.

కుంభ రాశి : బుధాదిత్య యోగం వలన ఈ రాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఈ నెల మొత్తం మీ ఆనందానికి అవధులు ఉండవు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కెరీర్‌లో ఉన్నతస్థానానికి ఎదుగుతారు.

వృషభ రాశి : బుధాదిత్య యోగం వలన వీరికి కలిసి వస్తుంది. ఆర్థికంగా సంపదతో స్థిరంగా ఉంటారు. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేస్తారు. వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలకు అనుకూలమైన కాలం ఇది.

Advertisement

Next Story

Most Viewed