శని తిరోగమనం.. ఈ మూడు రాశుల వారికి కష్టాలు తప్పవు ఇక!

by Jakkula Samataha |
శని తిరోగమనం.. ఈ మూడు రాశుల వారికి కష్టాలు తప్పవు ఇక!
X

దిశ, ఫీచర్స్ : జూన్ నెల ప్రారంభమైంది. ఈనెలలో గ్రహాల కలయిక వలన కన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారు సమస్యల్లో చిక్కుకుంటారు. అయితే ఈ నెలలో శని తిరోగమన దశలోకి వెళ్తున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తే మూడు రాశుల వారికి మాత్రం కష్టాలు, నష్టాలు తప్పవంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : శని తిరోగమనం వలన మేష రాశి వారికి నష్టాలు తప్పవు. వీరికి ప్రతికూల ప్రభావాలు ఎదురు అవుతాయి. ఏ పని చేపట్టినా మధ్యలోనే ఆగిపోవడం. నిత్యం ఇబ్బందుల్లో పడటం, అనారోగ్య సమస్యలు దరి చేరడం లాంటి ఇబ్బందులు వస్తాయంట.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు అప్పుల ఊబిలో చిక్కుకోవడం జరుగుతుంది. శనితిరోగమనం వలన వీరికి సమయానికి డబ్బు చేతికి అందదు. ఒక వేళ వ్యాపారంలో గనుక పెట్టుబడి పెడితే నష్టపోవడం ఖాయం. ఏ పని చేపట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంది. చాలా ఇబ్బందులు చుట్టుముడుతాయి.

మకర రాశి : ఈ రాశి వారికి శనితిరోగమనం వలన ఉద్యోగం పోయే ప్రమాదం పొంచి ఉంది. ఖర్చులు అధికం అవుతాయి. ఇంటా బయట ఇబ్బందులు, అపనిందలు, అవమానాలు తప్పవు.

Advertisement

Next Story

Most Viewed