- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రుపాన్ని తలచుకోగానే ముందుగా అందరికి గుర్తు వచ్చేది ఏడు కొండలు, మూడు నామాలు. స్వామి వారి రూపంలో ముందుగా ఆకట్టుకునే అత్యంత ప్రత్యేకమైన ఈ నామాల వెనుక దాగున్న పరమార్ధం ఏంటో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..
సాధారణంగా 5 ఏళ్ల లోపు పిల్లల్లో మనం చూసేది సత్వగుణం. ఈ సత్వ గుణం మనిషిలో ఉంటే, అది మనిషిని ఉన్నతమైన మార్గంలో, ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్ల నామాలు సత్వగుణాన్ని , దాని వల్ల కలిగే ఉద్రేక రహిత స్థితిని తెలియజేస్తాయి. అది పునాదిగా ఉండాలని కింద పాదపీఠం ఉంటుంది. సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకు వెలుతుందని సూచించేదే నిలువు బొట్టు. సత్వ గుణానికి అధిష్టాన దేవత శ్రీ మహా విష్ణువు కనుక రెండు తెల్లని ఊర్ధ్వ పుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహిస్తారు. ఇక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభసూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు. ఇది మొట్ట మొదటి సారి రామానుజాచార్యుల స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి మూడు నామాలు అలంకరించారట. అలా శ్రీనువాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మళ్లీ వచ్చే శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒక్కసారి మాత్రమే శ్రీవారికి మూడు నామాలు దిద్దుతారు.