మొక్కల్లో దేవుళ్లు నివసిస్తారని తెలుసా.. ?

by Prasanna |
మొక్కల్లో దేవుళ్లు నివసిస్తారని తెలుసా.. ?
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో మొక్కలు, చెట్లను ప్రత్యేకంగా పూజిస్తారు. అక్కడ దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు. పండుగల సమయంలో ఒక్కో మొక్కను పూజిస్తుంటారు. మరి, మొక్కల్లో ఏ దేవుళ్ళు నివసిస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుంది. కార్తీక, అశ్విని మాసాల్లో ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మారేడు చెట్టులో శివుడు కొలువై ఉంటాడని చెబుతారు. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

అలాగే అరటిచెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ చెట్టును గురువారం రోజున పూజిస్తారు. దీపావళి పూజ సమయంలో అరటి చెట్లను కూడా పూజిస్తారు. సత్యనారాయణ స్వామి వారి పూజ సమయంలో కూడా అరటి చెట్లను ఉంచుతారు.

వేప చెట్టులో దుర్గాదేవి నివసిస్తుందని నమ్ముతారు. మన దేశంతో పాటు, థాయిలాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో కూడా వేప చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. తులసి మొక్కలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉంటారని చెబుతుంటారు. మన ఇళ్ళలో ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. అలాగే కార్తీక మాసంలో శివుడు, విష్ణువులను కూడా పూజిస్తుంటారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed