కార్తీక మాసంలో చేసే స్నానాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాలంటే!

by Hamsa |   ( Updated:2023-11-12 09:16:18.0  )
కార్తీక మాసంలో చేసే స్నానాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాలంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండుగ తర్వాత కార్తీకమాసం స్టార్ట్ అవుతుంది. కార్తీక మాసం వచ్చిందంటే చాలు కొందరు మాంసం ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ 14న ప్రారంభం అయి డిసెంబర్ 13న ముగుస్తుంది. అయితే ఈ నెల రోజుల పాటు చాలా మంది భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. తెల్లవారు జామునే లేచి చల్లటి నీటితో స్నానం చేసి దీపాలు వెలిగించడానికి గుడికి వెళుతుంటారు. ప్రతి రోజూ చేసే స్నానం వేరు. కార్తీక మాసంలో చేసే స్నానం వేరంటారు పెద్దలు. సాధారణంగా చలికాలం పొద్దున లేవడం బద్ధకం. కానీ కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల ఉత్తేజ్ రెట్టింపు అవుతుందట. అలాగే ఈ స్నానం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వేకువజామునే లేవడం వల్ల అన్ని పనులు త్వరగా పూర్తి అయిపోతాయి. అలాగే ఉదయాన్నే లేచి నడవడం కూడా ఓ చక్కటి వ్యాయామం. పైగా నదీ జలాల్లో స్నానం చేయడం వల్ల.. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమై మానసిక ఆహ్లాదం నెలకొంటుంది. అందుకే చలి కాలంలోనే చాలా పండుగలు వస్తాయి. నదులు, సముద్రాల్లో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం. కార్తీక మాసంలో ముఖ్యంగా కాలువ, నది, సముద్రాల్లో స్నానం చేయడం మంచిదని అంటారు పెద్దలు. ఎందుకంటే కార్తీక మాసం వచ్చే సరికి.. వర్షాకాలం పూర్తి అయిపోయి.. నదుల ఉధృతి తగ్గి.. మలినాలన్నీ అడుక్కి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. ఆ నీటిలో స్నానం చేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. అందుకే నదుల్లో, సముద్రాల్లో, కాలువల్లో స్నానాలు చేయాలని పూర్వం పెద్దలు చెబుతుండేవారు. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. కార్తీక మాసంలో నువ్వుల నూనె, నెయ్యితో పెట్టిన దీపం నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతే కాదు చలికి ఆ దీపం వెచ్చదనాన్ని ఇస్తుంది.

Advertisement

Next Story