- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్భగుడి వెనుక నమస్కరిస్తేనే పుణ్యం వస్తుందా..? అసలు ఎందుకు దండం పెట్టాలో తెలుసా ?
దిశ, వెబ్‌డెస్క్ : సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు మన హిందూ దేవాలయాలు. ఇవి పురాతన కాలం నుంచి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అయితే దేవాలయాలకు వెళ్లే భక్తులు చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. కొంత మంది భక్తులు మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం ఆలయాలకు వెళ్తుంటారు. మరి కొంత మంది భక్తులు తమ బాధలను దేవుణికి విన్నవించుకుకోవడానికి వెళతారు. ఇంకొందరైతే లెక్కకు మించి కోరికలను దేవుణితో చెప్పుకుని ఆ కోరికలు తీరాలని మొక్కుతూ ఉంటారు. వారి కోరికలు తీరాలంటూ గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి వేడుకోవడం మాత్రమే కాదు.. గర్భగుడి వెనక భాగంలో కూడా మొక్కుతారు. అయితే గర్భగుడి వెనక భాగంలో ఎందుకు మొక్కుతారు, అలా నమస్కరించడం వలన కలిగే ఫలితాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆలయం వెనక భాగంలో మనపూర్వీకుల కాలం నుంచే ప్రతిఒక్క భక్తుడు కూడా ఆలయం వెనక భాగంలో నమస్కరిస్తూ ఉంటారు. అదే ఆచారాన్ని ఇప్పటికీ భక్తులు కొనసాగిస్తున్నారు. గుడి వెనక భాగంలో మొక్కితే వారికి అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. నిజానికి అది కారణం కాదని జ్యోతిష్యులు, వేద పండితులు చెబుతున్నారు. పురాణాలు, వేదపండితులు చెప్పిన దాని ప్రకారం దేవుని విగ్రహాన్ని గర్భగుడిలోపల వెనుక వైపున ఉన్న గోడకి కాస్త దూరంలోనే ఓ పీఠాన్ని అమర్చి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. అలా ప్రతిష్టించిన విగ్రహానికి ప్రతినిత్యం పూజలు, అభిషేకాలు, అర్చనలు అన్ని జరిపిస్తూ ఉంటారు.
అలా చేసినప్పుడు స్వామి వారి పాద పీఠం కింద ఉన్న యంత్రంలోకి మంత్ర శక్తి ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు. అలా మంత్ర శక్తి ప్రవేశించి విగ్రహానికి ఓ ఆకర్షణ శక్తి ఏర్పడుతుందని.. ఆ శక్తి గర్భగుడి లోపల నలుమూలల వ్యాపిస్తుందని, ముఖ్యంగా మూలవిరనాట్టు వెనక భాగంలో ఆకర్షన శక్తి అధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందుకే ఆలయం వెలక భాగంలో వెలుపల శిల్పాన్ని చెక్కుతారు. ఆ శిల్పాన్ని భక్తులు నమస్కరించడం వల్ల స్వామి వారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు మూలవిరాట్టును దర్శించిన తరువాత ఆలయం వెనక భాగంలో చెక్కిన శిల్పాన్ని మొక్తి శక్తిని పొందుతారని ప్రతీతి.