Sravana Masam 2024: శ్రావణ మాసంలో శనీశ్వరుడి అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి

by Prasanna |   ( Updated:2024-07-22 06:56:19.0  )
Sravana Masam 2024: శ్రావణ మాసంలో శనీశ్వరుడి అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా హిందూ మతంలో పూజలు ఎక్కువగా చేస్తుంటారు. వారంలో ప్రతి రోజు ఏదోక దేవుడి ఆరాధిస్తుంటారు. అదేవిధంగా శ్రావణ మాసంలో ఉపవాసాలు ఉండి దేవుడికి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా శివుడు, గౌరిదేవిలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం మొదలవుతుంది. జ్యోతిషశాస్త్రంలో శనిశ్వరుడి స్థానం చాలా ప్రత్యేకం. ప్రస్తుతం, శని కుంభరాశిలో ఉన్నాడు. శనితో బాధ పడేవారు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున శివుడిని ఇలా పూజిచండి.

శని మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శని దేవుడు ఒకసారి కన్నెర్ర చేస్తే సంపాదించిన డబ్బు మొత్తం ఒక రోజులోనే పోతుంది. కాబట్టి శని దేవుడికి ఎప్పుడూ కోపం తెప్పించకూడదు. శని వల్ల కొంతమంది కష్టాలు పడుతుంటారు. అలాంటి వారు, సోమవారం రోజు ఉదయాన్నే తల స్నానం చేసి శివయ్యను ధ్యానం చేయండి. ఇలా చేయడం వలన శని నుంచి విముక్తి పొందుతారు.

శనీ దేవుడి అనుగ్రహం పొందాలంటే శ్రావణ సోమవారం రోజున ఐదు రకాల పువ్వులతో శివునికి పూజ చేయండి. ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ మాసంలో ప్రతి సోమవారం చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వలన డబ్బు సమస్యల నుంచి బయటపడతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు

Advertisement

Next Story

Most Viewed