పొరపాటున కూడా మీ ఇంటి మెట్లకింద ఈ వస్తువులను పెట్టకూడదు.. ఎందుకో తెలుసా

by Sumithra |
పొరపాటున కూడా మీ ఇంటి మెట్లకింద ఈ వస్తువులను పెట్టకూడదు.. ఎందుకో తెలుసా
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు డాబా ఇండ్లనే కట్టుకుంటున్నారు. అన్ని ఇళ్లలో మెట్లు కంపల్సరీగా కట్టిస్తున్నారు.ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు డాబా ఇండ్లనే కట్టుకుంటున్నారు. అన్ని ఇళ్లలో మెట్లు కంపల్సరీగా కట్టిస్తున్నారు. ఆ మెట్లకింద ఉండే ఖాళీ స్థలంలో పనికి రాని వస్తువులు, లేదా మిగిలిపోయిన వస్తువులను పెడుతూ ఉంటారు. అంతే కాదు కొంతమంది మెట్ల కింద టాయిలెట్, బాత్రూమ్, వంటగది, పూజగదిని నిర్మిస్తారు. మరికొంతమంది మెట్ల కింద ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే అందులో చిన్న దుకాణం పెట్టి వ్యాపారం చేస్తారు. మరికొంత మంది మెట్ల కింద చెత్తను ఉంచడం, బూట్లు, చెప్పులను పెడుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం చాలా తప్పని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు మెట్ల కింద ఏయే వస్తువులు, ఏయే నిర్మాణాలు ఉంటే ఎలాంటి దోషం ఉంటుందో చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెట్ల కింద ఈ నిర్మాణాలు చేయవద్దు

మెట్ల కింద వంటగది, టాయిలెట్, బాత్రూమ్, పూజ గది అస్సలు నిర్మించకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. మెట్ల కింద ఉండే స్థలాన్ని బూట్లు, చెప్పులు పెట్టుకోవడానికి ఉపయోగించకూడదట. అలాగే మెట్ల కింద ఏదైనా నిర్మిస్తే వాస్తు దోషం కలుగుతుందని చెబుతున్నారు. దీని కారణంగా ఇంట్లో ఆనందానికి ఆటంకం ఏర్పడుతుంది.

నీటి ట్యాంక్ లేదా కుళాయి

మీ ఇంట్లో మెట్ల కింద కుళాయి, వాటర్ ట్యాంక్ పెడితే నీరు లీకేజ్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదా ఇంట్లోని డబ్బు కూడా నీళ్లలా ప్రవహించినట్టు ఖర్చు అవుతుంది.

చెత్తను పెట్టవద్దు...

చాలా మంది ఇంటి మెట్ల కింద ఉన్న స్థలాన్ని డస్ట్‌బిన్‌లను ఉంచడానికి ఉపయోగిస్తారు. ఇలా అస్సలు చేయకూడదట. వాస్తు ప్రకారం ఇంటి మెట్ల క్రింద డస్ట్‌బిన్‌ను ఉంచడం వల్ల ఇంటి పై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

కుటుంబ సభ్యుల ఫోటోలు

చాలా మంది ఇంట్లోని మెట్ల కింద ఖాళీ స్థలంలో ఫ్యామిలీ ఫోటోలు పెడతారు. వాస్తు ప్రకారం మెట్ల కింద ఫ్యామిలీ ఫోటో పెట్టకూడదట. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, పరస్పర విభేదాలు తలెత్తుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story