- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Skanda Sashti: సంతానం లేని వారు స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించండి!
దిశ, వెబ్ డెస్క్ : శివపార్వతులకు పుట్టిన చిన్న కుమారుడిని కుమార స్వామిగా ( kumaraswamy )పిలుస్తుంటాము. ఈ స్వామి వారికీ అనేక రకాల పేర్లు ఉన్నాయి. మురుగన్, కార్తీకేయ, స్కందుడు, షణ్ముఖుడు లాంటి పేర్లతో భక్తులు పిలుస్తుంటారు. అయితే.. హిందూ సాంప్రదాయ ప్రకారం, కార్తికేయుడి జన్మతిథిని స్కంద షష్ఠి పండుగగా జరుపుకుంటారు.
ఈ రోజున స్కందుడుకి కొన్ని పూజలు , పరిహారాలు చేస్తే కాలసర్పదోషాల నుంచి బయట పడతారని చెబుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభమయ్యి రెండో రోజు కూడా వచ్చింది. జనవరి నెల 5వ తేదీన స్కంద షష్ఠి వస్తుంది. ఈ రోజున కార్తీకేయుకుడికి పూజలు, అభిషేకాలు చేస్తే మంచిదని జ్యోతిష్యలు చెబుతున్నారు.
ముఖ్యంగా, సంతానం లేని వారు, రాహు, కేతుల దోషాలున్నవారు.. ఈ రోజున నాగ ప్రతిష్ట చేయిస్తే ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారు. కార్తీకేయుకుడు అనుగ్రహాం కోసం.. జనవరి 5 ఆదివారం ఉదయం తల స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకుని గుడికి వెళ్ళాలి. జంటనాగుల ఉన్న చోట.. పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యితో అభిషేకం చేయాలనీ పండితులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
- Tags
- Skanda Sashti