నమ్మినవారే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు.. ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి!

by Prasanna |   ( Updated:2024-02-04 05:17:15.0  )
నమ్మినవారే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు.. ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి!
X

దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని, సూర్యుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. వారు ఆకాశంలో కలుస్తున్నప్పుడు, వారి శక్తులు ఒకరినొకరు ఢీ కొంటాయి, కానీ అది అనుకూలంగా ఉండదు. వారు ప్రతి 30 ఏళ్లకు ఒకసారి కలుస్తారు. ఈ రెండు గ్రహాల కలయిక ఫిబ్రవరిలో జరుగుతుంది. దీని వలన ఈ రాశుల వారికి తీవ్ర నష్టం కలగనుంది. ఆ రాశు లేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కుంభ రాశి

కుంభరాశిలో శని, సూర్యుడు ఈ రాశి యొక్క మొదటి ఇంట్లో కలిసి ఉన్నారు. దీంతో వారు చేయాలనుకున్న పనులను చేయలేరు. ఈ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఉద్యోగం, మీ వ్యాపారంలో కొత్త సమస్యలు వస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది మంచి సమయం కాదు. అకస్మాత్తుగా ఉద్యోగం మానేయకండి అలాగే ఉద్యోగం మార్చకండి. అప్పుడు మీరు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఫిబ్రవరిలో తీసుకునే నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేదంటే ముందు చాలా సమస్యలను ఎదుర్కోవాలి.

సింహ రాశి

ఇతరుల మిమ్మల్ని మాటలు అన్నా మీరు గొడవలకి వెళ్లకండి. చిన్న విషయాలను పెద్దవిగా చేసి.. వాదించకండి. చట్టంతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. మీరు బాగా నమ్మిన వారి చేతిలో మోసపోతారు. కాబట్టి వారితో ఇప్పటి నుంచైనా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర అప్పు తీసుకున్న వారు, తిరిగి చెల్లిస్తారని గ్యారంటీ లేదు. నిన్ను నీవు రక్షించుకోవాలి.

Advertisement

Next Story