శ్రీవారి భక్తులకు అలర్ట్.. రూ.300 టికెట్లు విడుదల.. ఎప్పుడంటే..?

by sudharani |
శ్రీవారి భక్తులకు అలర్ట్.. రూ.300 టికెట్లు విడుదల.. ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠుడు దర్శనానికి నిత్యం వేలమంది ప్రజలు పోటెత్తుతూనే ఉంటారు. మే నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు ఉన్న కారణంగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మే, జూన్‌కు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ద్వారా భక్తులు రూ. 300 టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్‌ TTDevasthanams కూడా వినియోగించుకోవచ్చని తెలిపింది. అయితే.. టీటీడీ పేరిట అనేక నకిలి వెబ్‌సైట్ రూపొందించి మోసాలకు పాల్పడుతున్న కారణంగా.. మోసాల పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ పేర్కొంది.

Advertisement

Next Story