14 ఏళ్ల బాలిక గొప్ప సంకల్పం.. రామమందిర నిర్మాణానికి ఏకంగా రూ.52 లక్షలు విరాళం

by Prasanna |   ( Updated:2024-01-22 06:05:57.0  )
14 ఏళ్ల  బాలిక గొప్ప సంకల్పం..  రామమందిర నిర్మాణానికి ఏకంగా రూ.52 లక్షలు విరాళం
X

దిశ, ఫీచర్స్: 14 ఏళ్ల బాలిక అయోధ్యలోని రామ మందిరానికి లక్షల్లో విరాళాన్ని అందజేసింది. అంత చిన్న బాలిక ఏకంగా రూ.52 లక్షలు విరాళంగా ఇచ్చింది. చిన్న వయసులో అంత పెద్ద మొత్తంలో విరాళం ఎలా అందించిందా అని ఆలోచిస్తున్నారా..? దీని గురించి పూర్తి వివరాల్లోకెళ్తే..

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన భవికా మహేశ్వరి అనే 14 ఏళ్ల బాలిక రామ మందిరానికి తన వంతు విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది. తాను చదివిన కథలను లాజ్‌పూర్ జైలు, బహిరంగ సభల్లో ప్రజలకు చెప్పింది. అలాగే 2021లో లాజ్‌పూర్ జైలులో ఉన్న 3200 ఖైదీలకు రాముడి కథలను చెప్పగా.. అక్కడ వారు ఆ బాలికకు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. అలా ఆ బాలిక పదకొండు ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి 300పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ప్రదర్శనల ద్వారా మొత్తం రూ.52 లక్షల వరకు సంపాదించింది. ఆ మొత్తం డబ్బును అయోధ్య రామాలయ నిర్మాణం కోసం.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇచ్చి తన కలను నెరవేర్చుకుంది. ఈ వార్త పై స్పందించిన నెటిజెన్స్ సెలబ్రిటీల కన్నా నువ్వు చాలా బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది ఎంత గొప్ప మనసు అమ్మా నీది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story