Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

by Rani Yarlagadda |
Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ఇలవైకుంఠంగా భావించే తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకునేందుకు 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ (TTD) వెల్లడించింది. అలాగే నిన్న 61,448 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 21,374 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.18 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

కాగా.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) నేడు కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేయనున్నారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేజ్రీవాల్ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story